స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సి, డి ఎగ్జామినేషన్-2020 తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. స్కిల్ టెస్ట్ ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) సెప్టెంబర్ 23న విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ 20, 21 తేదీల్లో స్టెనోగ్రాఫర్ పరీక్ష స్కిల్ టెస్ట్‌ను ఎస్‌ఎస్‌సీ నిర్వహించింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి పోస్టులకు 3608 మంది అభ్యర్థులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి పోస్టులకు 13,445 మంది అభ్యర్థులు స్కిల్ టెస్టుకు హాజరయ్యారు. వీరిలో గ్రేడ్-సి పోస్టులకు 227 మంది, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి పోస్టులకు 1982 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనంతరం గ్రేడ్-సి పోస్టులకు 73 మంది అభ్యర్థులు, గ్రేడ్-డి పోస్టులకు 691 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
గ్రేడ్-సి పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు..
గ్రేడ్-డి పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు..
ఫలితాలు, కటాఫ్ మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..
కేంద్రప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి 2021 నవంబరులో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది. పరీక్షలో గ్రేడ్-సి పోస్టులకు 3608 మంది అభ్యర్థులు, గ్రేడ్-డి పోస్టులకు 13,445 మంది అభ్యర్థులు స్కిల్ టెస్టుకు అర్హత సాధించారు. వీరికి నిర్వహించిన స్కిల్ టెస్టు ఫలితాలను తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్- సి, డి ఎగ్జామినేషన్-2020కు సంబంధించి స్కిల్ టెస్ట్ ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) సెప్టెంబర్ 23న విడుదల చేసింది. జూన్ 20, 21 తేదీల్లో స్టెనోగ్రాఫర్ పరీక్ష స్కిల్ టెస్ట్‌ను ఎస్‌ఎస్‌సీ నిర్వహించింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకు 3608 మంది అభ్యర్థులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి పోస్టులకు 13,445 మంది అభ్యర్థులు స్కిల్ టెస్టుకు హాజరయ్యారు. వీరిలో గ్రేడ్-సి పోస్టులకు 227 మంది, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-డి పోస్టులకు 1982 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు అర్హత సాధించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో స్టెనోగ్రాఫర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
కేంద్రప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి 2021 నవంబరులో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది. పరీక్షలో గ్రేడ్-సి పోస్టులకు 3608 మంది అభ్యర్థులు, గ్రేడ్-డి పోస్టులకు 13,445 మంది అభ్యర్థులు స్కిల్ టెస్టుకు అర్హత సాధించారు. స్కిల్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 1 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించారు. అనంతరం తుది ఎంపిక ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది.
:: Also Read ::
SSC CHSL Result: సీహెచ్‌ఎస్‌ఎల్ 2020 ఫలితాలు వెల్లడి, 11297 మంది ఎంపిక!
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ - 2020 స్కిల్ టెస్ట్ ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ) అక్టోబర్ 18న విడుదల చేసింది. ఎస్ ఎస్ సీ నిర్ణయించిన కటాఫ్ ( డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్) ఆధారంగా 247 మంది, టైపింగ్ టెస్ట్ ఆధారంగా 11297 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికయ్యారు. మొత్తం 11,544 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు అర్హులయ్యారు. మొత్తం 4726 ఖాళీలకు ఈ ఎంపిక నిర్వహించారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ పీవో ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!
గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్-1 (పీవో) పోస్టుల భర్తీకి నిర్వహించిన మెయిన్ పరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) అక్టోబరు 18న ప్రకటించింది. అదేవిధంగా స్కేల్-II, స్కేల్-III ఆఫీసర్ ఆన్‌లైన్ పరీక్ష (సింగిల్ స్టేజ్) ఫలితాలను కూడా ఐబీపీఎస్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలను నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. అక్టోబరు 28 వరకు ఫలితాలు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థుల స్కోరు వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
గ్రామీణ డాక్ సేవక్ -2022 ఫలితాలు విడుదల, ఎంపికైంది వీరే!
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోస్టాఫీస్ సర్కిళ్ల పరిధిలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) నియామకాలకు సంబంధించిన ఆరో జాబితాను పోస్టల్ శాఖ అక్టోబర్ 18న విడుదల చేసింది. పదోతరగతి మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ తపాలా కార్యాలయాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి తపాలా శాఖ దరఖాస్తుల్ని స్వీకరించింది. గ్రామీణ డాక్ సేవక్ నియామక ప్రక్రియలో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైనవారి జాబితాను విడుదల చేసింది.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...