SSC JE Application: కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్చి 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 28న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కాగా, ఏప్రిల్ 18తో గడువు ముగియనుంది. అభ్యర్థులు రాత్రి 11 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఫీజు చెల్లించడానికి ఏప్రిల్ 19న రాత్రి 11 గంటల వరకు గడువు ఉంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుల వారీగా అభ్యర్థులకు వయోపరిమితిని నిర్ణయించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 180 030 930 63 టోల్‌ఫ్రీ నెంబరులో సంప్రదించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 968
❂ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్-2024
విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్.
విభాగాలవారీగా పోస్టులు:
⏩ విభాగం: బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే)
జూనియర్ ఇంజినీర్(సి): 438 పోస్టులు
⏩ విభాగం: బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే)
జూనియర్ ఇంజినీర్(ఇ & ఎం): 37 పోస్టులు
⏩ విభాగం: బ్రహ్మపుత్ర బోర్డు, జల శక్తి మంత్రిత్వ శాఖ
జూనియర్ ఇంజినీర్(సి): 02 పోస్టులు
⏩ విభాగం: సెంట్రల్ వాటర్ కమిషన్
జూనియర్ ఇంజినీర్(ఎం): 12 పోస్టులు
⏩ విభాగం: సెంట్రల్ వాటర్ కమిషన్
జూనియర్ ఇంజినీర్(సి): 120 పోస్టులు
⏩ విభాగం: సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్
జూనియర్ ఇంజినీర్(ఇ): 121 పోస్టులు
⏩ విభాగం: సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్
జూనియర్ ఇంజినీర్(సి): 217 పోస్టులు
⏩ విభాగం: సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్
జూనియర్ ఇంజినీర్(ఇ): 02 పోస్టులు
⏩ విభాగం: సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్
జూనియర్ ఇంజినీర్(సి): 03 పోస్టులు
⏩ విభాగం: డీజీక్యూఏ- నావల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్
జూనియర్ ఇంజినీర్(ఎం): 03 పోస్టులు
⏩ విభాగం: డీజీక్యూఏ- నావల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్
జూనియర్ ఇంజినీర్(ఇ): 03 పోస్టులు
⏩ విభాగం: ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ
జూనియర్ ఇంజినీర్(ఇ): 02 పోస్టులు
⏩ విభాగం: ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ
జూనియర్ ఇంజినీర్(సి): 02 పోస్టులు
⏩ విభాగం: మిలిటరీ ఇంజినీర్ సర్వీస్
జూనియర్ ఇంజినీర్(సి): గడువులోగా తెలియజేస్తారు.
⏩ విభాగం: మిలిటరీ ఇంజనీర్ సర్వీస్
జూనియర్ ఇంజినీర్(ఇ & ఎం): తర్వాత తెలియజేస్తారు.
⏩ విభాగం: నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్
జూనియర్ ఇంజినీర్(సి): 06 పోస్టులు
అర్హత: సంబంధిత ఇంజినీరింగ్ డిగ్రీ లేదా మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా అభ్యర్థులకు 2-3 సంవత్సరాల అనుభవం తప్పనిసరి. అయితే కొన్ని విభాగాల్లోని పోస్టులకు మాత్రమే అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
వయోపరిమితి: విభాగాల ఆధారంగా అభ్యర్థుల వయోపరిమితిలో తేడాలు ఉంటాయి. 01.08.2024 నాటికి వయోపరిమితిని పరిగణనలోకి తీసుకుంటారు. కొన్ని విభాగాలకు 32 సంవత్సరాలు, మరికొన్నింటికి 30 సంవత్సరాల వరకు గరిష్ఠ వయోపరిమితి నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు(జనరల్) 10 సంవత్సరాలు, దివ్యాంగులకు(ఓబీసీ) 13 సంవత్సరాలు, దివ్యాంగులకు(ఎస్సీ, ఎస్టీ) 15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలపాటు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. డిఫెన్స్ పర్సనల్స్ అభ్యర్థులకు ఎస్సీ-ఎస్టీలకు 8 సంవత్సరాలు, ఇతరులకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.
పరీక్ష ఫీజు: రూ.100. ఎస్‌బీఐ చలానా, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చు. మహిళా అభ్యర్థులు ఎస్సీ , ఎస్టీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఇప్పటికే యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఉన్నవారు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేనివారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష (పేపర్-1), కన్వెన్షల్ పరీక్ష (పేపర్-2), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
జీత భత్యాలు: రూ.35,400- రూ.1,12,400.
పరీక్ష విధానం:
✦ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామినేషన్ పరీక్షలను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తారు.
✦ మొత్తం 500 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. 'పేపర్-1'కు 200 మార్కులు, 'పేపర్-2'కు 300 మార్కులు ఉంటాయి.
✦ పేపర్-1లో మొత్తం 200 మార్కులకుగాను 200 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ ఇంటెలిజన్స్ & రీజనింగ్ విభాగం నుంచి 50 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 50 ప్రశ్నలు, జనరల్ ఇంజినీరింగ్ (సివిల్/ఎలక్ట్రికల్/ మెకానికల్) నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 2 గంటలు. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానిక 0.25 మార్కులు కోత విధిస్తారు. పేపర్-1లో అర్హత సాధించినవారికి పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు.
✦ ఇక పేపర్-2 విషయానికొస్తే.. మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/ ఇంజినీరింగ్ సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సివిల్ & స్ట్రక్చరల్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ విభాగాల్లో ఏదో ఒక విభాగంలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. పేపర్-2 పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో కాకుండా ప్రతి ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
ముఖ్యమైన తేదీలు..
✦ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.03.2024.
✦ దరఖాస్తుకు చివరితేది: 18.04.2024. (23:00 hours)
✦ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 19.04.2024. 4 (23:00 hours)
.✦ దరఖాస్తుల సవరణకు అవకాశం: 22.04.2024 to 23.04.2024
✦ పేపర్-1 పరీక్ష (సీబీటీ) తాత్కాలిక షెడ్యూల్: 04.06.2024 - 06.06.2024.
✦ పేపర్-2 పరీక్ష (కన్వెన్షనల్) తేది: ప్రకటించాల్సి ఉంది.