SSC Constable General Duty Revised Posts: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్‌ జనరల్ డ్యూటీ (Constable GD), రైఫిల్‌ మ్యాన్‌ జనరల్ డ్యూటీ (Rifle Man GD) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త తెలిపింది. పోస్టుల సంఖ్య భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్‌లో పేర్కొన ప్రకారం.. మొత్తం 26,146 ఖాళీలను భర్తీచేయాల్సి ఉండగా.. అదనంగా 20,471 పోస్టులను జతచేసింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,617కి చేరింది. ఇందులో పురుషులకు 41,467 పోస్టులు కేటాయించగా.. మహిళలకు 5150 పోస్టులు కేటాయించారు.

కేంద్ర బలగాల్లో 26,146 కానిస్టేబుల్‌, రైఫిల్‌ మ్యాన్‌ పోస్టుల భర్తీకి గతేడాది నవంబరు 24న స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి నవంబరు 24 నుంచి డిసెంబరు 31 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అభ్యర్థులకు ఈ ఏడాది ఫిబ్రవరి 20 నుంచి మార్చి 12 వరకు, సాంకేతిక కారణాల వల్ల కొన్ని కేంద్రాల్లో మార్చి 30న పరీక్షలు నిర్వహించింది. తెలుగుతోపాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించారు. 

కానిస్టేబుల్ రాతపరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏప్రిల్ 3న విడుదల చేసింది. ఆన్సర్ కీపై ఏప్రిల్ 10 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించింది. త్వరలోనే ఫైనల్ ఆన్సర్ కీతోపాటు ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఖాళీల సంఖ్యను భారీగా పెంచుతూ ఎస్‌ఎస్‌సీ నిర్ణయం తీసుకుంది. రాతపరీక్షతో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, మెడికల్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపికచేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్‌ 3 స్థాయి వేతనం లభిస్తుంది.

పెరిగిన పోస్టుల వివరాలు ఇలా..

* మొత్తం ఖాళీల సంఖ్య: 46,617 పోస్టులు (గతంలో 26,146)

పోస్టుల కేటాయింపు: యూఆర్-19,596, ఈడబ్ల్యూఎస్-5632, ఓబీసీ-9799, ఎస్టీ-4794, ఎస్సీ-6796.

విభాగం పోస్టుల సంఖ్య (పాతపోస్టులు) పెరిగిన పోస్టులు పోస్టుల కేటాయింపు
బీఎస్‌ఎఫ్‌ 6174 12,076 మెన్ - 10227;
ఉమెన్  - 1849
సీఐఎస్‌ఎఫ్‌ 11025 13,632  మెన్ - 11,558;
ఉమెన్ -  2,074
సీఆర్‌పీఎఫ్‌ 3337 9,410  మెన్ - 9,301;
ఉమెన్ - 109
ఎస్‌ఎస్‌బీ 635 1,926  మెన్ - 1,884;
ఉమెన్ - 42
ఐటీబీపీ 3189 6,287  మెన్ - 5,327;
ఉమెన్ -  960
ఏఆర్ 1490 2,990  మెన్ - 2,948;
ఉమెన్ -  42
ఎస్‌ఎస్‌ఎఫ్‌ 296 296  మెన్ - 222;
ఉమెన్ - 74
మొత్తం ఖాళీలు 26,146 46,617 46,617

  మారిన పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

రాత పరీక్ష ఇలా.. 
కానిస్టేబుల్, రైఫిల్‌ మ్యాన్‌ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి సంబంధించి మొత్తం 160 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించారు. పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో జనరల్‌ ఇంటలిజెన్స్‌ & రీజనింగ్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ & జనరల్‌ అవర్‌నెస్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, ఎలిమెంటరీ మాథమెటిక్స్‌-20 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్‌/హిందీ-20 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో ప్రతిప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు (అర మార్కు) కోత విధిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి తర్వాతి దశలో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహిస్తారు. ఫిజికల్ ఈవెంట్ల షెడ్యూలును త్వరలోనే వెల్లడించనున్నారు.

నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...