స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ పరీక్ష తేదీలను నవంబరు 24న ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల షెడ్యూలును అందుబాటులో ఉంచింది. మొత్తం నాలుగు విభాగాలకు సంబంధించిన పరీక్షల షెడ్యూలును స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. వీటిలో మూడు విభాగాలకు స్కిల్ టెస్ట్, ఒక్క విభాగానికి కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష (సీబీటీ) నిర్వహించనున్నారు. వీటిలో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2021, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్-2021, స్టెనోగ్రాఫ్ ఎగ్జామినేషన్-2022 విభాగాలకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తుండగా.. సీఏపీఎఫ్, ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్‌తో పాటు పలు విభాగాల్లో కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహించనున్నారు. 

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం..

🔰 కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2021 పోస్టుల భర్తీకి సంబంధించి వచ్చే ఏడాది జనవరి 4, 5 తేదీల్లో స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు.

🔰 కంబైన్డ్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్-2021 పోస్టుల భర్తీకి సంబంధించి వచ్చే ఏడాది జనవరి 6న స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు.

🔰 కానిస్టేబుల్-సీఏపీఎఫ్, ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్‌, రైఫిల్ మ్యాన్-అసోం రైఫిల్స్ ఎగ్జామినేషన్-2022 పోస్టుల భర్తీకి సంబంధించి వచ్చే ఏడాది జనవరి 10 నుంచి ఫిబ్రవరి 14 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. 

🔰 స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, డి ఎగ్జామినేషన్-2022 పోస్టుల భర్తీకి సంబంధించి వచ్చే ఏడాది ఫిబ్రవరి 15, 16 తేదీల్లో స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు.

క్ర.సం పరీక్ష పేరు పేపర్/ స్టేజ్ ఎగ్జామినేషన్ షెడ్యూలు
1. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ - 2021 స్కిల్ టెస్ట్ 04.01.2023 -  05.01.2023
2. కంబైన్డ్  హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్ - 2021 స్కిల్ టెస్ట్ 06.01.2023
3. కానిస్టేబుల్-సీఏపీఎఫ్, ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్‌, రైఫిల్ మ్యాన్-అసోం రైఫిల్స్ ఎగ్జామినేషన్-2022 సీబీటీ 10.01.2023 - 14.02.2023
4. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, డి ఎగ్జామినేషన్-2022 స్కిల్ టెస్ట్ 15.02.2023 - 16.02.2023

 

 

 

 

 

 

Also Read:

SAIL Recruitment: సెయిల్‌లో 245 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు, అర్హతలివే!
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్‌ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్‌ మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు, గేట్-2022 అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హత గల అభ్యర్ధులు నవంబర్ 23 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మిధానిలో వివిధ ఉద్యోగాలు, ఇలా దరఖాస్తు చేసుకోండి!
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని) పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి 10వ తరగతి/ ఐటీఐ/ ఇంటర్మీడియట్/ బీఎస్సీ/ జీఎన్‌ఎం ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు అర్హులు. రాతపరీక్ష, క్వాలిఫికేషన్, పని అనుభవం ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. సరైన అర్మతలు గల అభ్యర్థులు డిసెంబరు 07వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...