SSC CHSL 2023 Tier-II Preliminary Answer Key: కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో 1,762 ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్-2023 (టైర్-2) ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనవరి 13న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. టైర్-2 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్డ్ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థులు రెస్పాన్స్ షీట్లను కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందబాటులో ఉంచింది.  ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ.100 ఫీజు చెల్లించి జనవరి 13 నుంచి 15 వరకు ఆన్‌లైన్‌ ద్వారా తెలియజేయవచ్చు. స్టాఫ్ సెలక్షనక కమిషన్ నవంబరు 2న దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ టైర్-2 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 


SSC CHSL 2023 Tier-2 Preliminary Answer Key


కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, జూనియర్‌ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి మే నెలలలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆగస్టులో టైర్‌-1 పరీక్ష నిర్వహించారు. సెప్టెంబరు 27న టైర్-1 ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీనిద్వారా టైర్-2 పరీక్షకు 19,556 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. నవంబరు 2న టైర్-2 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీని తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది ఆన్సర్ కీతోపాటు, టైర్-2 ఫలితాలను వెల్లడించనుంది. టైర్-2 పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో కంప్యూటర్‌ టెస్ట్‌/ టైపింగ్‌ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 


స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ పరీక్ష విధానం..


✦  టైర్-2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు టైర్-3లో స్కిల్‌టెస్ట్/ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత ప‌రీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు.


✦ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు.. డేటా ఎంట్రీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాల వ్యవధి 15 నిమిషాలు. డేటా ఎంట్రీ పోస్టుల‌కు గంట‌కు 8000 కీ డిప్రెష‌న్స్ కంప్యూట‌ర్‌పై ఇవ్వాలి. ఇందుకోసం సుమారు 2000-2200 కీ డిప్రెష‌న్స్ ఉన్న ఇంగ్లిష్ వ్యాసాన్ని ఇచ్చి 15 నిమిషాల వ్యవ‌ధిలో కంప్యూట‌ర్‌లో టైప్ చేయ‌మంటారు.

✦ లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం 10 నిమిషాలు. టైపింగ్ టెస్ట్‌లో ఇంగ్లిష్ ఎంచుకున్నవారు నిమిషానికి 35 ప‌దాలు, హిందీని ఎంచుకున్నవారు నిమిషానికి 30 ప‌దాలు టైప్ చేయాలి.


ALSO READ:


డిగ్రీ అర్హతతో 'ఆర్మీ'లో ఆఫీసర్ పోస్టులు - NCC స్పెష‌ల్ ఎంట్రీ నోటిఫికేషన్ వెల్లడి
ఇండియన్ ఆర్మీలో 'ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్' 56వ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్లుగా చేరేందుకు 2024 అక్టోబరులో ప్రారంభమయ్యే కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏదైనా డిగ్రీతోపాటు ఎన్‌సీసీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జనవరి 8న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..