SSC Combined Graduate Level Examination 2024 Notification: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌-2024 (CGLE)' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీనిద్వారా దాదాపు 17,727 ఖాళీలను భర్తీ చేయనుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా అదనపు విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జూన్ 24 నుంచి జులై 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రెండంచెల (టైర్-1,టైర్-2) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 17,727


➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్


➥ అసిస్టెంట్


➥ ఇన్‌స్పెక్టర్ - (సీజీఎస్టీ & సెంట్రల్ ఎక్సైజ్)


➥ ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)


➥ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)


➥ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్


➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI)


➥ ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ)


➥ ఇన్‌స్పెక్టర్ - ఇన్‌కమ్ ట్యాక్స్


➥ అసిస్టెంట్/అసిస్టెంట్ సూపరింటెండెంట్


➥ ఇన్‌స్పెక్టర్ ( నార్కోటిక్స్)


➥ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (CBIC)


➥ రిసెర్చ్ అసిస్టెంట్ (NHRC)


➥ డివిజనల్ అకౌంటెంట్ (కాగ్)


➥ సబ్ ఇన్‌స్పెక్టర్  (NIA)


➥ సబ్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎన్‌సీబీ)


➥ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్)


➥ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ (హాంఅఫైర్స్)


➥ ఆడిటర్ (కాగ్, సీజీడీఏ, etc.,)


➥ అకౌంటెంట్ (కాగ్, సీజీఏ, etc.,)


➥ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్


➥ జూనియర్ అకౌంటెంట్ (CGCA)


➥ పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్)


➥ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్


➥  అప్పర్ డివిజన్ క్లర్క్


➥ ట్యాక్స్ అసిస్టెంట్


అర్హత: ఏదైనా డిగ్రీ. ఆడిట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సీఏ/ సీఎంఏ/ సీఎస్/ పీజీ డిగ్రీ (కామర్స్/ఎకనామిక్స్/బిజినెస్ స్టడీస్)/ఎంబీఏ (ఫైనాన్స్) అర్హత ఉండాలి.


వయోపరిమితి: 01.08.2024 నాటికి కొన్ని పోస్టులకు 18-27 సంవత్సరాలు, కొన్ని పోస్టులకు 20-30, కొన్ని పోస్టులకు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. మరికొన్ని పోస్టులకు 18 - 32 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఢిఫెన్స్ అభ్యర్థులకు 3- సంవత్సరాలు, ఢిఫెన్స్ అభ్యర్థులకు (డిసేబుల్డ్) - 8 సంవత్సరాలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 40-45 సంవత్సరాల వరకు, ఒంటరి/విడాకులు తీసుకున్న మహిళలకు 35-40 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: టైర్-1, టైర్-2 రాతపరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.




జీతం: ఆయా పోస్టులను బట్టి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,42,400 జీతం ఉంటుంది. ఇతర భత్యాలు అదనం.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.06.2024. 


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 24.07.2024 (23:00)


➥ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 25.07.2024 (23:00)


➥ దరఖాస్తుల సవరణ: 10.08.2024 - 11.08.2024(23:00) వరకు


➥ టైర్-1 పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): సెప్టెంబరు/అక్టోబరు, 2024.


➥ టైర్-2 పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): డిసెంబరు, 2024. 


Notification


Online Application


Website


ALSO READ:


➥ బ్యాంక్ ఆఫ్ బరోడాలో 459 ఉద్యోగాలు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా


➥ బ్యాంక్ ఆఫ్ బరోడాలో 168 పోస్టులు- ఈ అర్హతలుండాలి


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...