దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్-2022(పేపర్-1) తుది కీ, ప్రశ్నపత్రాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో కీ, ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కీ వివరాలు నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటాయి. 


కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పేపర్‌-1 రాత పరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరు 3న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఫలితాల్లో మొత్తం 3,224 మంది అభ్యర్థులు పేపర్-2 పరీక్షకు ఎంపికయ్యారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.


ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..




అక్టోబర్ 1న దేశవ్యాప్తంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను నవంబర్ 3న విడుదల చేసింది. పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 4న డిస్క్రిప్టివ్ విధానంలో పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. తుది కీతో పాటు ప్రశ్నపత్రాలను నవంబర్ 16 నుంచి నవంబర్ 30 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ పేర్కొంది. 


స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి జులై 20న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి జులై 20 నుంచి ఆగస్టు 4 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఆగస్టు 6న దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా అక్టోబరు 1న రాతపరీక్ష నిర్వహించింది. ఆన్సర్ కీ విడుదల చేసి కీపై అభ్యంతరాలు స్వీకరించింది. అనంతరం ఫలితాలను విడుదల చేసింది. పరీక్షలో కనీసం అర్హత మార్కులను జనరల్-30 %, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్-25 %, ఎస్సీ, ఎస్టీలకు 20 % గా నిర్ణయించింది. డిసెంబర్ 4న డిస్క్రిప్టివ్ విధానంలో పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.



Also Read:


AIIMS Recruitment: న్యూ దిల్లీ ఎయిమ్స్‌లో ఉద్యోగాలు, ఇలా దరఖాస్తుచేసుకోండి!
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్‌) వివిధ గ్రూప్ ఎ(నాన్-ఫ్యాకల్టీ), బి, సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు డిసెంబరు 19లోగా ఆన్‌లైన్‌లో దరకాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


బీడీఎల్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాలు, ప్రారంభం జీతం రూ.40 వేలు!
హైదరాబాద్ గచ్చిబౌలిలోని భారత్ డైనమిక్ లిమిటెడ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా  మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టుల వారీగా విద్యా‌ర్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు నవంబరు 28 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్ట్రాటజిక్ డిఫెన్స్ ఎక్విప్‌మెంట్స్ రంగంలో దేశ నిర్మాణం కోసం పనిచేయాలనుకునే డైనమిక్ యువతకి భారత్ డైనమిక్ లిమిటెడ్ సంస్థ సువర్ణావకాశాన్ని అందిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు కంపెనీకి చెందిన వివిధ యూనిట్లలో పోస్టింగ్ ఇవ్వబడుతుంది. ఎంపికైనవారిని హైదరాబాద్ గచ్చిబౌలి యూనిట్, కాంచన్ బాగ్ యూనిట్, హైదరాబాద్, భానూర్ యూనిట్, ఇబ్రహీంపట్నం, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా, విశాఖపట్నం, మహారాష్ట్ర, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లోని ఉన్న యూనిట్లలో నియమిస్తారు.  
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...