SSC Delhi Police Constable Final Results: ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలను (Constable Final Results) స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనవరి 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఈ మేరకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) అధికారిక ప్రకటన విడుదల చేసింది. కానిస్టేబుల్ తుది ఫలితాలకు  సంబంధించి మొత్తం 6976 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇందులో 6854 అభ్యర్థుల వివరాలను ప్రకటించగా.. 123 మంది అభ్యర్థుల ఫలితాలను పలు కారణాలతో పెండింగ్‌లో ఉంచింది. వీరి ఫలితాలను తర్వాత వెల్లడించనుంది. 


కానిస్టేబుల్ తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి..


కటాఫ్ మార్కులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెప్టెంబరు 1న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 7547 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 3 వరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం రాతపరీక్ష నిర్వహించింది.


ప్రిలిమినరీ ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ డిసెంబరు 6న విడుదల చేసింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలను డిసెంబర్‌ 9 వరకు స్వీకరించింది.  ఇక డిసెంబరు 31న ఫలితాలు వెల్లడయ్యాయి. రాతపరీక్ష ద్వారా మొత్తం 85,867 మంది అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు జనవరి 13 నుంచి 20 వరకు ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించారు. తాజాగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.  ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు పే లెవల్-3 (రూ.21,700-రూ.69,100) ప్రకారం జీత భత్యాలు ఉంటాయి.


పోస్టుల వివరాలు..


* కానిస్టేబుల్ పోస్టులు


1) కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- పురుషులు: 5,056 పోస్టులు 


పోస్టుల కేటాయింపు: జనరల్- 3053, ఈడబ్ల్యూఎస్‌- 542, ఓబీసీ- 287, ఎస్సీ- 872, ఎస్టీ- 302.


2)  కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- మహిళలు: 2,491 పోస్టులు 


పోస్టుల కేటాయింపు: జనరల్- 1502, ఈడబ్ల్యూఎస్‌- 268, ఓబీసీ- 142, ఎస్సీ- 429, ఎస్టీ- 150.


నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


ALSO READ:


ఏఐఏఎస్‌ఎల్‌లో 130 సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
ఎయిర్ ఇండియా ఎయిర్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్‌) కాంట్రాక్ట్ ప్రాతిపదికన సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 130 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు ఉన్నవారు ఫిభ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు  ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిఉంటుంది. ఉదయం 0900 నుంచి 1200 గంటల వరకు ఇంటర్వూలు నిర్వహిస్తారు. శారీరక దారుఢ్య పరీక్ష, ఆంగ్ల ప్రావీణ్యత పరీక్ష మరియు ఇంటర్వ్యూలు (వ్యక్తిగత లేదా వర్చువల్) ఆధారంగా ఎంపిక ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...