SSC Constable General Duty Results: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ (Constable GD), రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీ (Rifle Man GD) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 10న వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో రెండు జాబితాల్లో (లిస్ట్-1, లిస్ట్-2) ఫలితాలను అందుబాటులో ఉంచింది.
రాతపరీక్షలో ఉత్తీర్ణులైన వారికి త్వరలో ఫిజికల్ ఈవెంట్లు (PET, PST) నిర్వహిస్తారు. వీటిల్లో పాసైన వారికి తర్వాతి దశంలో మెడికల్ పరీక్షలే, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. చివరకు రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలకు అభ్యర్థులు ఎంపికచేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్ 3 స్థాయి వేతనం లభిస్తుంది.
ఫలితాలకు సంబంధించి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్‌ను మినహాయించి మొత్తం 3,10,678 మంది పురుషులు; 39,437 మంది మహిళలు ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికయ్యారు. మాల్ ప్రాక్టీస్, కోర్టు ఉత్తర్వుల కారణంగా 1061 మంది అభ్యర్థుల ఫలితాలను పెండింగ్‌లో ఉంచారు. ఇక 730 మంది అభ్యర్థులను డిబార్ చేశారు. ఫలితాలతో పాటు ప్రశ్నపత్రం, తుది కీని కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు జులై 24 డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
LIST-I :LIST OF FEMALE CANDIDATES QUALIFIED FOR PET/PST (IN ROLL NO ORDER)
LIST-II :LIST OF MALE CANDIDATES QUALIFIED FOR PET/PST (IN ROLL NO ORDER)
కటాఫ్ మార్కులు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
ప్రశ్నపత్రం, తుది ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..
కేంద్ర బలగాల్లో 26,146 కానిస్టేబుల్, రైఫిల్ మ్యాన్ పోస్టుల భర్తీకి గతేడాది నవంబరు 24న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి నవంబరు 24 నుంచి డిసెంబరు 31 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అభ్యర్థులకు ఈ ఏడాది ఫిబ్రవరి 20 నుంచి మార్చి 12 వరకు, సాంకేతిక కారణాల వల్ల కొన్ని కేంద్రాల్లో మార్చి 30న పరీక్షలు నిర్వహించింది. తెలుగుతోపాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించారు.
ఖాళీల సంఖ్య భారీగా పెంపు..
నోటిఫికేషన్‌లో పేర్కొన ప్రకారం.. మొత్తం 26,146 ఖాళీలను భర్తీచేయాల్సి ఉండగా.. అదనంగా 20,471 పోస్టులను జతచేసింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,617కి చేరింది. ఇందులో పురుషులకు 41,467 పోస్టులు కేటాయించగా.. మహిళలకు 5150 పోస్టులు కేటాయించారు.
పెరిగిన పోస్టుల వివరాలు ఇలా..
* మొత్తం ఖాళీల సంఖ్య: 46,617 పోస్టులు (గతంలో 26,146)
పోస్టుల కేటాయింపు: యూఆర్-19,596, ఈడబ్ల్యూఎస్-5632, ఓబీసీ-9799, ఎస్టీ-4794, ఎస్సీ-6796.
విభాగం | పోస్టుల సంఖ్య (పాతపోస్టులు) | పెరిగిన పోస్టులు | పోస్టుల కేటాయింపు |
బీఎస్‌ఎఫ్ | 6174 | 12,076 | మెన్ - 10227; ఉమెన్ - 1849 |
సీఐఎస్‌ఎఫ్ | 11025 | 13,632 | మెన్ - 11,558; ఉమెన్ - 2,074 |
సీఆర్‌పీఎఫ్ | 3337 | 9,410 | మెన్ - 9,301; ఉమెన్ - 109 |
ఎస్‌ఎస్‌బీ | 635 | 1,926 | మెన్ - 1,884; ఉమెన్ - 42 |
ఐటీబీపీ | 3189 | 6,287 | మెన్ - 5,327; ఉమెన్ - 960 |
ఏఆర్ | 1490 | 2,990 | మెన్ - 2,948; ఉమెన్ - 42 |
ఎస్‌ఎస్‌ఎఫ్ | 296 | 296 | మెన్ - 222; ఉమెన్ - 74 |
మొత్తం ఖాళీలు | 26,146 | 46,617 | 46,617 |