SSC Selection Posts Application: స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) వివిధ కేంద్రం ప్రభుత్వ విభాగాల్లో సెలక్షన్‌ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 2049 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 26న ప్రారంభంకాగా.. దరఖాస్తు గడువు మార్చి 18తో ముగియాల్సి ఉంది. అయితే ఈ గడువును మార్చి 26 వరకు పొడిగించారు. అభ్యర్థులు మార్చి 27 వరకు ఫీజు చెల్లించవచ్చు. దరఖాస్తుల సవరణకు మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, తదితర పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 6 నుంచి 8 వరకు రాతపరీక్ష నిర్వహించనున్నారు.


వివరాలు..


* సెలక్షన్‌ పోస్టులు (ఫేజ్-XII/ 2024)


మొత్తం ఖాళీలు: 2049 పోస్టులు (ఎస్సీ- 255; ఎస్టీ- 124; ఓబీసీ- 456; యూఆర్‌- 1028; ఈడబ్ల్యూఎస్‌- 186)


➥ లెవెల్స్‌: 1, 2, 3, 4, 5, 6.


➥ లైబ్రరీ అటెండెంట్


➥ లేడీ మెడికల్ అటెండెంట్ (మహిళ మాత్రమే) 


➥ మెడికల్ అటెండెంట్ 


➥ నర్సింగ్ ఆఫీసర్


➥ ఫార్మసిస్ట్ (అల్లోపతిక్)


➥ ఫీల్డ్‌మ్యాన్


➥ డిప్యూటీ రేంజర్


➥ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్


➥ అకౌంటెంట్


➥ లేబొరేటరీ అటెండెంట్


➥ అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్(ప్లాంట్ పాథాలజీ/వైరాలజీ/బ్యాక్టీరియాలజీ)


➥ అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (వీడ్ సైన్స్)


➥ అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్(ఎంటమాలజీ/నెమటాలజీ)


➥ సీనియర్ సైంటిఫికేషన్ (టాక్సికాలజీ)


➥ లేబొరేటరీ అటెండెంట్


➥ ఫోర్ మ్యాన్


➥ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (కెమికల్)


➥ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజీ)


➥ లేబొరేటరీ అటెండెంట్


➥ జూనియర్ ఇంజినీర్


➥ డ్రిల్లర్- కమ్ -మెకానిక్


➥ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 


➥ గర్ల్ క్యాడెట్ ఇన్‌స్ట్రక్టర్ (GCI)


➥ యూడీసీ


➥ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 'బి'


➥ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్


➥ జూనియర్ ఇంజినీర్ (కమ్యూనికేషన్)


➥ జూనియర్ కంప్యూటర్


➥ స్టాక్‌మ్యాన్ (జూనియర్ గ్రేడ్)


➥ లేబొరేటరీ అటెండెంట్


➥ డ్రైవర్-కమ్ మెకానిక్


➥ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్


➥ సూపర్‌వైజర్ 


➥ సీనియర్ ట్రాన్స్‌లేటర్ 


➥ స్టోర్ కీపర్ ఎంట్రీ ఆపరేటర్ 


➥ రిసెర్చ్ ఇన్వెస్టిగేటర్ 


➥ కోర్ట్ క్లర్క్ 


➥ సీనియర్ జియోగ్రాఫర్, తదితర పోస్టులు


అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: పోస్టుని అనుసరించి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలపాటు వయో సడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/ డేటాఎంట్రీ టెస్ట్/ కంప్యూటర్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


పరీక్ష విధానం: పరీక్షలో భాగంలో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. అందుకు 50 మార్కులు కేటాయిస్తారు. జనరల్ అవేర్‌నెస్ -25 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 25 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్-25 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు. 


తెలుగు రాష్ట్రాలలో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్ (8601), కర్నూలు (8003), విజయవాడ (8008), విశాఖపట్నం(8007), చీరాల (8011), చీరాల (8011), గుంటూరు (8001), కాకినాడ (8009), నెల్లూరు (8010), రాజమండ్రి (8004), తిరుపతి (8006), విజయనగరం (8012), కరీంనగర్ (8604), వరంగల్ (8603).


పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.02.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 18.03.2024 (23:00 Hrs) (26.03.2024 వరకు పొడిగించారు)


➥ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 19.03.2024 (23:00 Hrs) (27.03.2024 వరకు పొడిగించారు)


➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 22.03.2024 - 24.03.2024. (23:00 Hrs) (30.03.2024 - 01.04.2024.)


➥ కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 06 - 08 మే, 2024.


Notification 


Online Application


Website


                               


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...