స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవలే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్(SSC CGL)-2022 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 13 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అక్టోబరు 19, 20 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. అయితే తాజాగా ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 1 నుండి 13 సీజీఎల్ 'టైర్-1' పరీక్షలు నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డ్ విడుదలకు సంబంధించి మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే నవంబరు మూడోవారం నుంచి అడ్మిట్ కార్డులు జారీచేసే అవకాశం ఉంది.
టైర్-1 పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్-25 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్--25 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-25 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్-25 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఒక్కో తప్పు సమాధానానికి 0.5 మార్కులు కోత విధిస్తారు. పరీక్ష సమయం గంట (60 నిమిషాలు).
భర్తీ చేసే పోస్టులివే..
* ఖాళీల సంఖ్య: 20,000
➥ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
➥ అసిస్టెంట్/ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
➥ ఇన్‌స్పెక్టర్ - ఇన్‌కమ్ ట్యాక్స్
➥ ఇన్‌స్పెక్టర్ - సెంట్రల్ ఎక్సైజ్
➥ ఇన్‌స్పెక్టర్ (ప్రివెంటివ్ ఆఫీసర్)
➥ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)
➥ అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్
➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI)
➥ ఇన్‌స్పెక్టర్ ( పోస్టల్ శాఖ)
➥ ఇన్‌స్పెక్టర్ ( నార్కోటిక్స్)
➥ అసిస్టెంట్
➥ డివిజనల్ అకౌంటెంట్ (కాగ్)
➥ సబ్ ఇన్‌స్పెక్టర్ (CBI/ CBN)/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ఎన్‌ఐఏ)
➥ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (స్టాటిస్టిక్స్)
➥ ఆడిటర్ (కాగ్, సీజీడీఏ)
➥ అకౌంటెంట్ (కాగ్, సీజీఏ, etc.,)
➥ అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్
➥ పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ (పోస్టల్)
➥ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్
➥ ట్యాక్స్ అసిస్టెంట్
➥ అప్పర్ డివిజన్ క్లర్క్.
SSC CGL 2022 నోటిఫికేషన్, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read
హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో అప్రెంటిస్‌షిప్‌లు, వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) 2022-23 సంవత్సరానికి ఏడాది టెక్నీషియన్, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. పోస్టుని అనుసరించి బీఈ, బీటెక్, డిప్లొమా, బీకాం, బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. డిప్లొమా/ ఇంజినీరింగ్ డిగ్రీ/ గ్రాడ్యుయేషన్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు, ఇంటర్వ్యూ మరియు రాత పరీక్ష లేదు. వాక్-ఇన్ నవంబర్ 09న నిర్వహిస్తారు. ఆసక్తి గల అభ్యర్ధులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా వాక్-ఇన్‌కు హాజరుకావాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
AP High Court Jobs: ఏపీలో 3673 కోర్టు ఉద్యోగాలు, ఈ అర్హతలు ఉండాలి!
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఏపీ హైకోర్టు గుడ్ న్యూస్ తెలిపింది. అమరావతిలోని ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 19 రకాల నోటిఫికేషన్‌ల ద్వారా 3673 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వీటిల్లో హైకోర్టు పరిధిలో 241 పోస్టులు ఉండగా, రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో 3432 ఖాళీలు ఉన్నాయి.
నోటిఫికేషన్లు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో 322 హెడ్‌కానిస్టేబుల్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ స్పోర్ట్స్ కోటా గ్రూప్ సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.12వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. క్రీడా ప్రదర్శన, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెరిట్ లిస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు భారతదేశం, విదేశాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్లు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..