కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గతేడాది కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్(సీజీఎల్), కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ పరీక్ష (సీహెచ్‌ఎస్‌ఎల్)కు నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీజీఎల్ టైర్-1 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన టైర్-2 పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 6న ప్రకటించింది. వీటిలో గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి టైర్-2 పరీక్షను మార్చి 2 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ ఫిబ్రవరి 6న ప్రకటించింది.
అలాగే, 4500 లోయర్ డివిజన్ క్లర్కులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర ఉద్యోగాలను భర్తీకి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ పరీక్ష టైర్-1ను మార్చి 9 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షలకు సంబంధించిన అప్‌డేట్లు ఎప్పటికప్పుడు తమ అధికారిక వెబ్‌సైట్‌లో పొందొచ్చని అభ్యర్థులకు సూచించింది.
సీజీఎల్-2022 పోస్టుల వివరాలు..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవలే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్(SSC CGL)-2022ను సెప్టెంబరు 17న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 13 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అక్టోబరు 19, 20 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 1 నుండి 13 సీజీఎల్ 'టైర్-1' పరీక్షలు నిర్వహించింది. అడ్మిట్ కార్డ్ విడుదలకు సంబంధించి మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే నవంబరు మూడోవారం నుంచి అడ్మిట్ కార్డులు జారీచేసే అవకాశం ఉంది.
SSC CGL 2022 నోటిఫికేషన్, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి..
టైర్-2 పరీక్ష:
సీహెచ్‌ఎస్‌ఎల్ పోస్టుల వివరాలు..
కేంద్రప్రభుత్వ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించే 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్-2022' నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) డిసెంబరు 6న విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా పలు విభాగాల్లోని లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీచేయనున్నారు. డిసెంబరు 6 నుంచి జనవరి 4 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. రెండు దశల పరీక్షల (టైర్-1, టైర్-2) ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు. తాజాగా టైర్-1 పరీక్షల నిర్వహణ తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకించింది.
సీహెచ్‌ఎస్‌ఎల్-2022 నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
టైర్-1 పరీక్ష (ఆబ్జెక్టివ్) పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు టైర్-1 ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్) నుంచి 15 ప్రశ్నలు - 50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు - 50 మార్కులు ఉంటాయి. ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు.
టైర్-2 పరీక్ష విధానం..
స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ పరీక్ష విధానం..
✦ టైర్-2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు టైర్-3లో స్కిల్‌టెస్ట్/ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
✦ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు.. డేటా ఎంట్రీ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాల వ్యవధి 15 నిమిషాలు. డేటా ఎంట్రీ పోస్టులకు గంటకు 8000 కీ డిప్రెషన్స్ కంప్యూటర్‌పై ఇవ్వాలి. ఇందుకోసం సుమారు 2000-2200 కీ డిప్రెషన్స్ ఉన్న ఇంగ్లిష్ వ్యాసాన్ని ఇచ్చి 15 నిమిషాల వ్యవధిలో కంప్యూటర్‌లో టైప్ చేయమంటారు.
✦ లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం 10 నిమిషాలు. టైపింగ్ టెస్ట్‌లో ఇంగ్లిష్ ఎంచుకున్నవారు నిమిషానికి 35 పదాలు, హిందీని ఎంచుకున్నవారు నిమిషానికి 30 పదాలు టైప్ చేయాలి.
Also Read:
➥ 9394 ఉద్యోగాల దరఖాస్తుకు కొద్దిరోజులే గడువు, వెంటనే అప్లయ్ చేయండి! మారిన పరీక్ష తేదీ!
➥ SSC MTS: మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 12,523 - రీజయన్ల వారీగా ఖాళీలు ఇలా!