కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో సెలక్షన్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) మార్చి 6న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 5369 సెలక్షన్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైంది. దరఖాస్తు గడువు నేటితో (మార్చి 27) ముగియనుంది. రాత్రి 11 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే అభ్యర్థులు మార్చి 28న రాత్రి 11 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చు. ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకోలేనివారు రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, తదితర పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
  
వివరాలు..


మొత్తం ఖాళీలు: 5369


➥ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II 


➥ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్


➥ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్


➥ హిందీ టైపిస్ట్


➥ సౌండ్ టెక్నీషియన్


➥ అకౌంటెంట్ 


➥ ప్లానింగ్ అసిస్టెంట్ 


➥ టెక్నికల్ అసిస్టెంట్


➥ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్


➥ టెక్స్‌టైల్ డిజైనర్


➥ రిసెర్చ్ ఇన్వెస్టిగేటర్ 


➥ రిసెర్చ్ అసిస్టెంట్


➥ లాబొరేటరీ అసిస్టెంట్


➥ జూనియర్ కంప్యూటర్


➥ లైబ్రరీ-&-ఇన్‌ఫర్మేషన్ అసిస్టెంట్


➥ సెక్షన్ ఆఫీసర్


➥ అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్


➥ జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్


➥ డ్రాఫ్ట్స్ మాన్


➥ ప్రాసెసింగ్ అసిస్టెంట్


➥ టెక్నికల్ అసిస్టెంట్


➥ అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్


➥ నావిగేషనల్ అసిస్టెంట్


➥ గర్ల్ కేడెట్ ఇన్‌స్ట్రక్టర్


➥ ఛార్జ్‌మ్యాన్


➥ క్యాంటీన్ అటెండెంట్


➥ ఫర్టిలైజర్ ఇన్‌స్పెక్టర్


➥ సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్


➥ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్


➥ స్టోర్ క్లర్క్


➥ డాక్యుమెంటేషన్ అసిస్టెంట్


➥ టెక్నికల్ ఆపరేటర్ (డ్రిల్లింగ్)


➥ గ్లేజర్ కమ్ ట్రిమ్మర్


➥ ఎకనామిక్ ఇన్వెస్టిగేటర్, తదితర పోస్టులు


అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలపాట వయో సడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/ డేటాఎంట్రీ టెస్ట్/ కంప్యూటర్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


పరీక్ష విధానం: పరీక్షలో భాగంలో జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. అందుకు 50 మార్కులు కేటాయిస్తారు. జనరల్ అవేర్‌నెస్ -25 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 25 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్-25 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు. 


దరఖాస్తు ఫీజు: రూ.100.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.03.2023 నుంచి.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.03.2023


➥ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 28.03.2023.


➥ ఆఫ్‌లైన్ చలానా జనరేషన్‌కు చివరితేది: 28.03.2023.


➥ చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 29.03.2023.


➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 03.04.2023 to 05.04.2023 (23:00)


➥ కంప్యూటర్ ఆధారిత పరీక్ష: జూన్ - జులై 2023.


Notification


Online Application


Website



Also Read:


గెయిల్‌ గ్యాస్‌ లిమిలెడ్‌లో 120 అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!
నోయిడాకు చెందిన భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన గెయిల్ ఆధ్వర్యంలోని గెయిల్ గ్యాస్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 126 సీనియర్ అసోసియేట్, జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


యంత్ర ఇండియా లిమిటెడ్‌లో 5,395 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!
నాగ్‌పూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో 57వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని  ద్వారా మొత్తం 5,395 ఐటీఐ, నాన్ ఐటీఐ ఖాళీలను భర్తీచేయనున్నారు. మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 ఖాళీలు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు. నెలకు నాన్-ఐటీఐలకు రూ.6000; ఐటీఐలకు రూ.7000 చెల్లిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...