స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, డి ఎగ్జామినేషన్-2022 'పేపర్-1' ప్రాథమిక కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరు 24న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు తమ రూల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లు పొందవచ్చు. స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి నవంబరు 17, 18 తేదీల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. నవంబరు 24న సాయంత్రం 5 గంటల నుంచి నవంబరు 28న సాయంత్రం 5 గంటల వరకు ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆన్సర్ కీపై అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే తెలపవచ్చు. నవంబరు 24న సాయంత్రం 5 గంటల నుంచి నవంబరు 28న సాయంత్రం 5 గంటల వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే ప్రతి ప్రశ్నకు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా వచ్చిన అభ్యంతరాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్స్, అభ్యంతరాల నమోదు కోసం క్లిక్ చేయండి..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ఆగస్టు 20న స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ - 2022 ప్రకటనను విడుదల చేసింది. దీనిద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉండి, టైపింగ్ తెలిసిన అభ్యర్థుల నుంచి ఆగస్టు 20 నుంచి సెప్టెంబరు 5 వరకు దరఖాస్తులు స్వీకరించింది. సెప్టెంబరు 7న దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించింది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది నియామకాలు చేపడతారు.
నోటిఫికేషన్, పరీక్ష విధానం తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పేపర్-2 పరీక్ష తేదీ వెల్లడి, ఎప్పుడంటే?
కేంద్రప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి నిర్వహించినున్న పేపర్-2 ఎగ్జామినేషన్ తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరు 23న వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 11న పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. పేపర్-1 పరీక్షలో అర్హత సాధించిన 3,224 మంది అభ్యర్థులు పేపర్-2 పరీక్ష రాయడానికి అర్హులు. వాస్తవానికి డిసెంబరు 4న పరీక్ష నిర్వహించాలని మొదట భావించారు. కానీ డిసెంబరు 11న నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
పరీక్ష పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
కానిస్టేబుల్ పరీక్ష మార్కుల వివరాలు వెల్లడి, ఇలా చూసుకోండి!
కేంద్ర సాయుధ బలగాలైన సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్స్, సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్, రైఫిల్‌మెన్ ఇన్ అసోం రైఫిల్స్, ఎన్‌ఐఏలో కానిస్టేబుల్(జీడీ) నియామక పరీక్ష-2021 ఫలితాల తుది మార్కుల జాబితాను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబర్ 23న వెల్లడించింది. పరీక్ష ఫలితాలను నవంబర్ 7న విడుదల చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల తుది మార్కులను ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. పరీక్ష రాసిన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ద్వారా మార్కులను చూసుకోవచ్చు. ఈ అవకాశం డిసెంబర్ 7 వరకు అందుబాటులో ఉంటుంది.
మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..