SSC GD Final Answer Key 2025 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ మధ్య నిర్వహించిన జీడీ పరీక్షకు సంబంధించి ఫైనల్ కీ విడుదల చేసింది. అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏమిటంటే, CAPFలలో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్‌లో SSF, రైఫిల్‌మ్యాన్ (GD), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పరీక్షల ఫైనల్ కీని ప్రశ్నాపత్రాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు https://ssc.gov.in ద్వారా సంబంధిత ప్రశ్నాపత్రాలతో పాటు SSC GD ఫైనల్ ఆన్సర్ కీ 2024-25ని డౌన్‌లోడ్ చేుకోవచ్చు. కమిషన్ వెబ్‌సైట్‌లో వారి రిజిస్టర్డ్ ID, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి అభ్యర్థులు SSC GD ఫైనల్ ఆన్సర్ కీ 2025ని యాక్సెస్ చేయవచ్చు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించడానికి SSC GD కానిస్టేబుల్ ప్రాథమిక ఆన‌్సర్ కీని4 మార్చి 2025న విడుదల చేశారు. 9 మార్చి 2025 వరకు అభ్యంతరాలు తెలియజేయాలని సూచించారు. వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఫైనల్ కీ విడుదల చేశారు.
SSC GD ఫైనల్ ఆన్సర్ కీ 2025 PDF డౌన్‌లోడ్ లింక్ ఇదేSSC GD ఫైనల్ ఆన్సర్ కీ 2025 PDF డౌన్‌లోడ్ అధికారిక లింక్ ఇప్పుడు యాక్టివ్‌గా ఉంది. అభ్యర్థుల సౌలభ్యం కోసం డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ ఇక్కడ షేర్ చేశాం. దీన్ని అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్‌సైట్ – ssc.nic.in కి వెళ్లండి.
- హోమ్‌పేజీలో“క్వశ్చన పేపర్స్‌తోపాటు ఫైనల్ ఆన్సర్ కీ డౌన్‌లోడ్…” లింక్‌పై క్లిక్ చేయండి.
- పూర్తి నోట్ చదివి, పేజీ చివర ఇచ్చిన ఫైనల్ ఆన్సర్ కీ లింక్‌పై క్లిక్ చేయండి.
- ఇన్‌పుట్ ఫీల్డ్‌లలో, రోల్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
- తుది సమాధాన కీ, ప్రశ్నపత్రాన్ని చూడవచ్చు, ఆ పీడీఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. సేవ్ చేయండి.