SSC CPO Final Results: ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ విభాగాల్లో సబ్ ఇన్‌స్పెక్టర్(SI) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఎస్‌ఎస్‌సీ సీపీవో 2023 తుది ఎంపిక ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏప్రిల్ 6న వెల్లడించింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 1865 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కాగా 1786 మందితో కూడిన జాబితాను మాత్రమే స్టాప్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వివిధ కారణాల వల్ల 79 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచింది. ఫలితాలతోపాటు కేటగిరీలవారీగా కటాఫ్ మార్కుల వివరాలను కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది.


ఫలితాల కోసం క్లిక్ చేయండి..


ఫలితాల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 22న నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసిన సంగతి తెలిసిందే. జులై 22 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. దీనిద్వారా బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌‌లో ఖాళీలను భర్తీచేయనున్నారు. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా.. 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. 


ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌)లో సబ్-ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష-2023కు సంబంధించి అక్టోబరు 3 నుంచి 5 వరకు పేపర్‌-1 (కంప్యూటర్ ఆధారిత) పరీక్ష నిర్వహించారు. వీటి ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అక్టోబరు 25న విడుదల చేసింది. పేపర్‌-1 పరీక్షలో మొత్తం 31,240 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో 2607 మంది మహిళలు అర్హత సాధించగా.. 28,633 మంది పురుష అభ్యర్థుల అర్హత సాధించారు. ఇక ఢిల్లీ పోలీసు విభాగం నుంచి మొత్తం 182 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.


పేపర్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ ఈవెంట్లు (పీఈటీ/ పీఎస్‌టీ) నిర్వహించారు. ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన 8544 మంది అభ్యర్థులకు జనవరి 8న పేపర్-2 పరీక్ష నిర్వహించారు. పేపర్-2లో అర్హత సాధించిన 7046  అభ్యర్థులకు మార్చి 1 నుంచి 20 వరకు సర్టిఫికేట్ల పరిశీలన, మెడికల్ టెస్టులు నిర్వహించారు. వీరిలో పురుషులు 6478 ఉండగా, మహిళలు 568 మంది ఉన్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత తాజాగా తుది ఎంపిక ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.35,400-రూ.1,12,400 జీతం అందుతుంది. 


ALSO READ:


ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో 158 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు
ఢిల్లీలోని షహబాద్ దౌలత్‌పూర్‌లోని ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ, స్లెట్‌/ సెట్‌, యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌/ ఐకార్‌/ జీప్యాట్‌/ గేట్/ ఐసీఎంఆర్‌/ నెట్‌- లెక్చర్‌షిప్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధన అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 14 వరకు దరఖాస్తులు పమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..