సబ్ ఇన్ స్పెక్టర్ (ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్) పేపర్-1 ఎగ్జామినేషన్-2022 ప్రాథమిక 'కీ'ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరు 16న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలపవచ్చు. అభ్యంతరాలు తెలిపేందుకు నవంబరు 20 వరకు అవకాశం కల్పించింది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అభ్యంతరాలు తెలపాల్సి ఉంటంది.
ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో 4695 సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆగస్టులో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 10 నుంచి 30 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. నవంబరు 9 నుంచి 11 వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని నవంబరు 16న విడుదల చేసింది.
ఢిల్లీపోలీస్ SI ఎగ్జామ్-2022 ఆన్సర్ కీ ఇలా చూసుకోండి..
➥ ఆన్సర్ కీ కోసం అభ్యర్థుల మొదటి అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి - https://ssc.nic.in/
➥ అక్కడ హోంపేజీలో పైభాగంలో కనిపించే 'ANSWER KEY' ట్యాబ్ మీద క్లిక్ చేయాలి.
➥ క్లిక్ చేయగానే వచ్చే పేజీలో 'Tentative Answer Key(s) along with Candidates' Response Sheet(s) - Sub-Inspector in Delhi Police and CAPFs Examination (Paper-I), 2022' ఆన్సర్ కీకి సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి.
➥ ఛాలెంజ్ సిస్టమ్ పేజీలో 'Sub Inspector in Delhi Police Exam 2022' ఆప్షన్ ఎంపిక చేసుకొని SUBMIT బటన్‌పై క్లిక్ చేయాలి.
➥ ఇలా క్లిక్ చేయగానే వచ్చే లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ రోల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేయాలి.
➥ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ల, అభ్యంతరాల నమోదుకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది.
➥ రెస్పాన్స్ షీట్లు, ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే అభ్యంతరాలు తెలపవచ్చు.
ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్, అభ్యంతరాల నమోదు కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఎస్‌ఎస్‌సీ జేహెచ్‌టీ ఎగ్జామ్ ఫైనల్ 'కీ' విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ ఎగ్జామినేషన్-2022(పేపర్-1) తుది కీ, ప్రశ్నపత్రాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో కీ, ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కీ వివరాలు నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటాయి.
ఫైనల్ కీ, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
CISF Recruitment: సీఐఎస్‌ఎఫ్‌లో 787 కానిస్టేబుల్ పోస్టులు - టెన్త్ అర్హత చాలు!
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 787 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 641 పోస్టులు పురుషులకు, మహిళలకు 69 పోస్టులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 77 పోస్టులు కేటాయించారు. పదోతరగతి అర్హత ఉన్న స్త్రీ, పురుషులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్, మెడికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..