SSC CGL 2025 Final Result: స్టాఫ్ సెలక్షన్ కమిషన్(Staff Selection Commission Recruitment) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ 2025 ఫైనల్ రిజల్ట్స్ పోర్టల్‌లో పెట్టింది. అధికారికంగా తుది ఫలితాలను కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోని(Government Jobs 2026) 15,118 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ను గత ఏడాది విడుదల చేశారు. వివిధ దశల వడపోత తర్వాత ఇప్పుడు సెలెక్టెడ్ జాబితాను(SSC CGL Selected Candidates List) ఆన్‌లైన్‌లో ఉంచారు.
ఇప్పుడు విడుదల చేసిన అభ్యర్థులు ఫైనల్ దశ వెరిఫికేషన్ ఉంటుంది. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తి అయిన వారు మాత్రమే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ గ్రూప్ బి, గ్రూప్ సీ విభాగాల్లో బాధ్యతలు చేపట్టేందుకు అనుమతి ఇస్తారు.
ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ 2025 ఫైనల్ రిజల్ట్స్ పీడీఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన జాబితాలో వివిధ కేటగిరీల్లో(SSC Merit List Category Wise) ఎంత మంది ఎంపికయ్యారో వివరంగా కమిషన్ లిస్ట్ ప్రిపేర్ చేసింది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో పెట్టిన వివరాల ప్రకారం 6458 మంది అన్‌రిజర్వ్డ్ కేటగిరిలో ఎంపికయ్యారు. 3832 మంది ఓబీసీ కోటాలో సెలెక్ట్ అయ్యారు. షెడ్యూల్ కులాల కోటా కింద 2,221 మంది, ఎంపికైతే, ఎస్టీ విభాగంలో 1132 మంది నియమితులయ్యారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కేటగిరీలో 1475 మంది ఉద్యోగాలు పొందబోతున్నట్టు ఈ జాబితా చూస్తే అర్థమవుతుంది.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?
తుది ఫలితాల జాబితాను పీడీఎఫ్ రూపంలో ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. దీన్ని చూడాలంటే అభ్యర్థులు కొన్ని స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inను విజిట్ చేయాలి. అక్కడ హోమ్ పేజీలో SSC CGL Final Results 2025 అనే లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. వెంటనే మీకు ఫలితాల పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. అందులో ఏ కేటగిరిలో ఏ విభాగంలో(Group B, Group C) ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఎంత మంది ఎంపికయ్యారో వివరాలు ఉంటాయి. కటాఫ్ వివరాలు కూడా ఇచ్చారు. పోస్టుల వారీగా ఎంత మందిని సెలెక్ట్ చేశారు. ఆ పోస్టుకు సెలెక్ట్ అయిన ఆఖరి అభ్యర్థి మార్కులు, పుట్టిన తేదీని కూడా ఇచ్చారు.
ఇందులో ఎంపికైన వారు ఏం చేయాలి?
తుది ఫలితాల్లో ఎంపిక అభ్యర్థులు వెంటనే ప్రభుత్వం ఉద్యోగాల్లో(Central Government Jobs) చేరడానికి ముందు మరో ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానమైంది డాక్యుమెంట్ వెరిఫికేషన్. అభ్యర్థులు సమర్పించిన విద్యార్హతలు, సామాజిక వర్గం, ఇతర పత్రాలను సంబంధిత అధికారులు పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వారికి కేటాయించిన డిపార్ట్‌మెంట్ నుంచి నియామక ఉత్తర్వులు అందుతాయి.
