PM Modi Convoy Cars: న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.3 కు పైగా పెరిగాయి. రెండున్నర నెలలుగా పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం కారణంగా ఆయిల్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు ఇంధన వినియోగం తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఆయన సైతం తన కాన్వాయ్‌ల సంఖ్య భారీగా తగ్గించారు. కేవలం 2 కార్లలో వెళ్తూ ప్రజలతో పాటు నేతలకు ఆదర్శంగా నిలిచారు. అయితే ప్రధాని మోదీ సెక్యూరిటీ మూవ్‌మెంట్‌లో కేవలం 2 రకాల వాహనాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకటి రేంజ్ రోవర్ కాగా, రెండోది ఫార్చ్యూనర్ కారు. 

Continues below advertisement

దేశంలో కీలక నేత అయిన నరేంద్ర మోదీ కేవలం రెండు కార్లు రేంజ్ రోవర్, ఫార్చ్యూనర్ వాడుతున్నారు. కొందరు లగ్జరీ అని చెబుతంటే, మరికొందరు ప్రధానికి హై సెక్యూరిటీ ఇస్తాయా అని చర్చిస్తున్నారు. ఫార్చ్యూనర్ స్ట్రాంగ్ బాడీ, మంచి పనితీరుకు ఫేమస్. మైలేజ్, భద్రతలో వీటిలో ఏ కారు పవర్‌ఫుల్, వాటి వివరాలపై ఓ లుక్కేయండి. 

రేంజ్ రోవర్‌లో హై లెవల్ సెక్యూరిటీప్రపంచంలోని అత్యంత ప్రీమియం, హై సెక్యూరిటీ ఎస్‌యూవీలలో (SUV) రేంజ్ రోవర్ ఒకటి. ప్రధాని మోదీ కాన్వాయ్‌లో ఉపయోగించే ప్రత్యేక రేంజ్ రోవర్‌ను బుల్లెట్ రెసిస్టెంట్ టెక్నాలజీ,  అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లతో కంపెనీ తయారుచేసింది. ఇందులో బలమైన బాడీ షెల్, బ్లాస్ట్ ప్రొటెక్షన్, హైటెక్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఫీచర్లు ఇచ్చారు. అందుకే ఎస్పీజీ (SPG) లాంటి పెద్ద సెక్యూరిటీ ఏజెన్సీలు ఈ వాహనాన్ని ఎక్కువగా వినియోగిస్తాయి. 

Continues below advertisement

Also Read: Petrol Diesel Price Hike: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?

అయితే మైలేజ్ విషయానికి వస్తే, ఇంత భారీ, పవర్‌ఫుల్ ఎస్‌యూవీ ఎక్కువ ఇంధనం వినియోగిస్తుంది. సాధారణంగా దీని మైలేజీ లీటరుకు 6 నుండి 8 కిలోమీటర్ల వరకు ఇస్తుందని భావిస్తారు. కానీ ఇక్కడ మైలేజీపై కాకుండా భద్రత, పనితీరుతో నమ్మకమైన వాహనంగా మారింది. అద్భుతమైన రోడ్ ప్రెజెన్స్, లగ్జరీ ఇంటీరియర్ కారణంగా ఈ వాహనం విఐపి (VIP) మూవ్‌మెంట్‌కు  ప్రాధాన్యతగా నిలుస్తుంది.

అద్భుతమైన మైలేజీ ఇచ్చే ఫార్చునర్టొయోటా ఫార్చూనర్ విషయానికి వస్తే, భారత్‌లోని నాయకులు, అధికారులు, భద్రతా ఏజెన్సీలకు ఫేవరెట్ అని చెప్పవచ్చు. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, నమ్మకమైన ఇంజన్ వల్ల కారుపై నమ్మకం ఎక్కువే. అధ్వాన్నమైన రోడ్ల నుండి హైవేల వరకు ఫార్చూనర్ ప్రతిచోటా అద్భుతమైన పనితీరుతో కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. అందుకే ప్రధాని మోదీ కాన్వాయ్‌లో కూడా ఈ వెహికిల్ కనిపిస్తుంది. మైలేజ్ పరంగా ఫార్చూనర్.. రేంజ్ రోవర్ కంటే చాలా ముందుందని చెబుతారు. దీని డీజిల్ వేరియంట్ లీటరుకు సుమారు 10 నుంచి 12 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

Also Read: Supreme Court: ప్రధానికి వ్యతిరేకంగా మంత్రి వెళ్లగలరా? ఎన్నికల సంఘం నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భద్రత కోసం ఇందులో మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, బలమైన ఛాసిస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫార్చూనర్ ఈజీగా కనిపిస్తున్నప్పటికీ ప్రజలకు బాగా నచ్చుతుంది. అందుకే తక్కువ ఖర్చులో అధిక భద్రత, బెస్ట్ పనితీరు కోరుకునే వారికి ఈ SUV మంచి ఎంపికగా ఉంది.