చెన్నైలోని దక్షిణ రైల్వే కన్‌స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 15 పోస్టులను చేయనున్నారు. సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ. వ్యాలిడ్ గేట్(2021/ 2022/ 2023) స్కోరు సాధించివారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
* సీనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు
అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ. వ్యాలిడ్ గేట్(2021/ 2022/ 2023) స్కోరు సాధించి ఉండాలి.
వయోపరిమితి: 20 - 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతం: నెలకు రూ.32,000 నుంచి రూ.37,000.
దరఖాస్తుకు చివరితేదీ: 30.06.2023.
ALSO READ:
తెలంగాణ కేజీబీవీల్లో 1,241 ఉద్యోగాలు, దరఖాస్తులు ఎప్పుడంటే?
తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్‌ఎఎస్)లో ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లో మొత్తం 1,241 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జూన్ 16న ప్రకటన జారీ చేసింది. కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో స్పెషల్ ఆఫీసర్, సీఆర్‌టీల ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని ప్రభుత్వం పేర్కొంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 43 ఐటీ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) ఒప్పంద ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికి జులై 03 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..