Southern Railway Recruitment: సదరన్ ఇండియన్ రైల్వే వివిధ విభాగాల్లో అప్రెంటీస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 2,860 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 50% మార్కులతో పదో తరగతి, ఇంటర్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఫిభ్రవరి 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మెరిట్ జాబితా, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 2,860. 


* అప్రెంటీస్‌ పోస్టులు


ఫ్రెషర్స్ కేటగిరీ..


➥ సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ వర్క్‌షాప్(పొదనూర్‌, కోయంబత్తూర్‌): 20


➥ క్యారేజ్‌ అండ్‌ వేగన్‌ వర్క్స్(పెరంబుర్‌): 83


➥ రైల్వే హాస్పిటల్‌(పెరంబుర్‌): 20


ఎక్స్-ఐటీఐ కేటగిరీ..


➥ సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ వర్క్‌షాప్(పొదనూర్‌, కోయంబత్తూర్‌): 95


➥ తిరువనంతపురం డివిజన్‌: 280


➥ పాలక్కడ్‌ డివిజన్‌: 135


➥ సాలెమ్‌ డివిజన్‌: 294


➥ క్యారేజ్‌ అండ్‌ వేగన్‌ వర్క్స్(పెరంబుర్‌): 333


➥ లోకో వర్క్స్(పెరంబుర్‌): 135


➥ ఎలక్ట్రికల్‌ వర్క్‌షాప్(పెరంబుర్‌): 224


➥ ఇంజినీరింగ్‌ వర్క్‌షాప్(అరక్కోనం): 48


➥ చెన్నై డివిజన్‌(పర్సనల్ బ్రాంచ్): 24


➥ చెన్నై డివిజన్‌(ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/అరక్కోనం): 65


➥ చెన్నై డివిజన్‌(ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/అవది): 65


➥ చెన్నై డివిజన్‌(ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/తంబరం): 55  


➥ చెన్నై డివిజన్‌(ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్/రాయపురం): 30


➥ చెన్నై డివిజన్‌- మెకానికల్(డిజిల్): 22


➥ చెన్నై డివిజన్‌- మెకానికల్(క్యారేజ్‌ అండ్‌ వేగన్‌): 250


➥ చెన్నై డివిజన్‌- రైల్వే హాస్పిటల్‌(పెరంబుర్‌): 03


➥ సెంట్రల్‌ వర్క్‌షాప్(పొన్మలై): 390


➥ తిరుచిరాపల్లి డివిజన్‌: 187


➥ మధురై డివిజన్‌: 102


వర్క్‌షాప్‌లు/ యూనిట్‌లు: సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ (పొదనూర్‌, కోయంబత్తూర్‌), క్యారేజ్‌ అండ్‌ వేగన్‌ (పెరంబుర్‌), రైల్వే హాస్పిటల్‌ (పొరంబుర్‌), తిరువనంతపురం డివిజన్‌,  పాలక్కడ్‌ డివిజన్‌, సాలెమ్‌ డివిజన్‌, లోకో (పెరంబుర్‌), ఎలక్ట్రికల్‌ (పెరంబుర్‌), ఇంజినీరింగ్‌ (అరక్కోనం), చెన్నై డివిజన్‌, మెకానికల్‌ (డీజిల్‌), క్యారేజ్‌ అండ్‌ వేగన్‌ ఎలక్ట్రికల్‌/రోలింగ్‌ స్టాక్‌ (అరక్కోనం, అవది, తంబరం, రాయపురం), సెంట్రల్‌ (పొన్మలై), తిరుచిరాపల్లి డివిజన్‌, మధురై డివిజన్‌.


ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్ (గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌), ఎంఎల్‌టీ(రేడియాలజీ), ఎంఎల్‌టీ(పాథాలజీ), ఎంఎల్‌టీ(కార్డియాలజీ), టర్నర్‌, సీఓపీఏ,  ప్లంబర్‌, పీఏఎస్‌ఏఏ, మెకానిక్- మెషిన్ టూల్ మెయింటనెన్స్, ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, మెకానికల్, అడ్వాన్స్‌డ్‌ వెల్డర్‌, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, మెకానిక్- రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెకానిక్- మోటార్ వైకిల్, అడ్వాన్స్‌డ్ వెల్డర్,  స్టెనోగ్రాఫర్&సెక్రేటేరియల్ అసిస్టెంట్, ఇన్ఫర్మేషన్& కమ్యునికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటనెన్స్, పెయింటర్(జనరల్), 


అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, ఇంటర్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.


ట్రైనింగ్‌ పీరియడ్‌: ఫిట్టర్‌, వెల్డర్‌ (గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌), మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నిషియన్స్‌ ట్రేడులకు 15 నెలల నుంచి 2 సంవత్సరాలు, ఇతర ట్రేడులకు 1 సంవత్సరం.


దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.


ఎంపిక విధానం: మెరిట్ జాబితా, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 


పే స్కేల్: నెలకు రూ.9,000. నుంచి రూ.12,000.


ముఖ్యమైనతేదీలు..


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.01.2024


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 28.02.2024.


Notification


Online Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...