Railway Apprenticeship: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2023-24 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని రాయ్‌పూర్ డివిజన్, వాగన్ రిపేర్ షాప్(రాయ్‌పూర్‌)లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అప్రెంటిస్ వెబ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో మే 01లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

వివరాలు..

* ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 1,113 పోస్టులు

1) డీఆర్‌ఎం ఆఫీస్, రాయ్‌పూర్ డివిజన్: 844 పోస్టులు

➥ వెల్డర్(గ్యాస్ & ఎలక్ట్రిక్)- 161 పోస్టులు

➥ టర్నర్- 54 పోస్టులు

➥ ఫిట్టర్- 207 పోస్టులు

➥ ఎలక్ట్రీషియన్- 212 పోస్టులు

➥ స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్)- 15 పోస్టులు

➥ స్టెనోగ్రాఫర్(హిందీ)- 08 పోస్టులు

➥ కంప్యూటర్ ఆపరేటర్ అండ్‌ ప్రోగ్రామ్ అసిస్టెంట్- 10 పోస్టులు

➥ హెల్త్ అండ్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్- 25 పోస్టులు

➥ మెషినిస్ట్- 15 పోస్టులు

➥ మెకానిక్ డీజిల్- 81 పోస్టులు

➥ మెషిన్ రిఫ్రిజిరేటర్ అండ్‌ ఎయిర్ కండీషనర్- 21 పోస్టులు

➥ మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్- 35 పోస్టులు

2) వాగన్ రిపేర్ షాప్-రాయ్‌పూర్‌: 269 పోస్టులు

➥ ఫిట్టర్- 110 పోస్టులు

➥ వెల్డర్- 110 పోస్టులు

➥ మెషినిస్ట్- 15 పోస్టులు

➥ టర్నర్- 14 పోస్టులు

➥ ఎలక్ట్రీషియన్- 14 పోస్టులు

➥ కంప్యూటర్ ఆపరేటర్ అండ్‌ ప్రోగ్రామ్ అసిస్టెంట్- 04 పోస్టులు

➥ స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్)- 01 పోస్టులు

➥ స్టెనోగ్రాఫర్(హిందీ)- 01 పోస్టులు

ట్రేడులు: వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్, హిందీ), కంప్యూటర్ ఆపరేటర్ అండ్‌ ప్రోగ్రామ్ అసిస్టెంట్, హెల్త్ అండ్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, మెషిన్ రిఫ్రిజిరేటర్ అండ్‌ ఎయిర్ కండీషనర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్.

అర్హత:కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:02.04.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం:మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 01.05.2024.

Notification

Apprenticeship Application Portal 

Website

                                     

ALSO READ:

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, నాగ్‌పుర్‌లో 861 యాక్ట్‌ అప్రెంటిస్ పోస్టులుసౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2024-25 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని నాగ్‌పూర్ డివిజన్, మోతిబాగ్ వర్క్‌షాప్(నాగ్‌పూర్)లో యాక్ట్‌ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అప్రెంటిస్ వెబ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో మే 09లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..