పూణేలోని సీమెన్స్‌ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫ్రెషర్స్‌తోపాటు, అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు పూణేలోని కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.

వివరాలు..

* సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

అర్హత: ఏదైనా డిగ్రీ (కంప్యూటర్ సైన్స్).

అనుభవం: ఫ్రెషర్స్/ఎక్స్‌పీరియన్స్.

పనిప్రదేశం: పూణే.

ఉద్యోగ స్వభావం, స్కిల్స్:

➥ ఐటీ సెక్యూరిటీకి సంబంధించి విండోస్ సర్వర్, ఎస్‌క్యూఎల్ సర్వర్, అపాచే/అపాచే టామ్‌క్యాట్ అంశాలపై అవగాహన ఉండాలి.

➥ అపాచే వెబ్‌ సర్వర్, అపాచే టామ్‌క్యాట్ సర్వర్లకు సంబంధించి మంచి టెక్నికల్ నాలెడ్జ్ (కాన్‌ఫిగరేషన్ & మేనేజ్‌మెంట్) ఉండాలి.

➥ జెన్‌కిన్స్, గిట్ ల్యాబ్, సీఐ/సీడీ టూల్స్ ఉపయోగించి అపాచే/అపాచే టామ్‌క్యాట్ సర్వర్, ఆటోమేషన్‌‌లో వెబ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ అనుభవం ఉండాలి.

➥ అపాచే అప్లికేషన్ సర్వర్ ఎస్‌ఎస్‌ఎల్ రీ-సర్టిఫికేషన్, సర్వర్ లోడ్ బ్యాలెన్సింగ్ & మేనేజ్‌మెంట్.

➥ విండోస్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్

➥ ఎస్‌‌క్యూఎల్ క్వరీస్, ఎస్‌‌క్యూఎల్ సర్వర్ బ్యాకప్ & రీస్టోర్‌పై కనీస అవగాహన అవసరం.

➥ కొన్నిసార్లు కష్టతరమైన అప్లికేషన్స్ ప్రొడక్షన్ & టెస్ట్ ఎన్విరాన్‌మెంట్‌లో పనిచేయాల్సి ఉంటుంది.

➥ అద్భుతమైన ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఉండాలి.

➥ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌‌లో డెవలపర్లతో కలిసి పనిచేయడానికి తగిన ప్రావీణ్యం ఉండాలి.

➥ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మల్టీటాస్కింగ్ స్కిల్స్ అవసరమవుతాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, ఇతర విధానాల ద్వారా.

Notification & Online Application

Website

Also Read:

ఐడీబీఐ బ్యాంకులో 1036 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1036 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 24 నుంచి జూన్ 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఐడీబీఐ బ్యాంకులో 136 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు, ఈ అర్హతలుండాలి!ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 136 ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అర్హతలు, అనుభవం, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జూన్ 1 నుంచి జూన్ 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మేనేజర్ పోస్టులకు రూ.48,170 - రూ.69810; అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు రూ.63,840- రూ.78,230; డిప్యూటీ జనరల్ మేనేజర్పోస్టులకు రూ.76,010- రూ.89,890గా ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..