తెలంగాణ స్టేట్ లెవల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన ఎస్‌ఐ (సివిల్, ఐటీ అండ్ సీఓ, పీటీఓ) తత్సమాన పోస్టులు, ఏఎస్‌ఐ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల ఫలితాల ‘కీ’ ని ఏప్రిల్ 15 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పోలీసు నియామక మండలి ఏప్రిల్ 14న ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించనున్నారు. ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఆర్థమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్, జనరల్ స్టడీస్, తెలుగు, ఉర్దూ, రెండు నాన్ టెక్నికల్ పేపర్లకు సంబంధించిన పరీక్షలను మూడు జిల్లాల్లో 81 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.
పోలీసు ఫైనల్ పరీక్షల్లో భాగంగా ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని ఏప్రిల్ 15న ఉదయం నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. వీటికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి 17 వరకు వెబ్‌సైట్ ద్వారా స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను డాక్యుమెంట్, పీడీఎఫ్, జేపీజీ రూపంలో వెబ్‌సైట్‌లో సమర్పించవచ్చు. అందుకు సంబంధించిన ప్రొఫార్మాను తమ వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులో ఉంచారు.
ఫైనల్ కీని విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. మిగతా పేపర్లకు సంబంధించిన ప్రిలిమినరీ కీ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ప్రకటలో తెలిపారు.
Also Read:
తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇలా!
తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 6న నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. విడుదలైంది. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు మొత్తం 9 నోటిఫికేషన్లు జారీ చేసింది. గురుకులాల్లో ఖాళీలకు సంబంధించి అత్యధికంగా టీజీటీ పోస్టులు 4020 ఉన్నాయి. ఆ తర్వాత అత్యధికంగా జూనియర్ కళాశాలల్లో 2008 లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. ఇక గురుకుల పాఠశాలల్లో 1276 పీజీటీ పోస్టులు ఉన్నాయి. వీటి తర్వాత డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 434 లైబ్రేరియన్ పోస్టులు, 275 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 134 ఆర్ట్స్ టీచర్ పోస్టులు, 92 క్రాఫ్ట్ టీచర్ పోస్టులు, 124 మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి.
నోటిఫికేషన్లు, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సీజీఎల్ఈ-2023 నోటిఫికేషన్ వచ్చేసింది, ఈ సారి 7500 వరకు ఖాళీల భర్తీ - దరఖాస్తు ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2023' నోటిఫికేషన్‌ను స్థాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. దీనిద్వారా దాదాపు 7500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అవసరాలకు అనుగుణంగా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశమూ ఉంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా అదనపు విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 3 నుంచి మే 3 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. రెండంచెల (టైర్-1,టైర్-2) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..