Security Printing Press, Hyderabad Notification: మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్-హైదరాబాద్‌, వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సూపర్‌వైజర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, ఫైర్‌మ్యాన్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

ఖాళీల వివరాలు..

ఖాళీల సంఖ్య: 96 పోస్టులు

పోస్టుల కేటాయింపు: యూఆర్-50, ఈడబ్ల్యూఎస్-08, ఎస్సీ-09, ఎస్టీ-06, ఓబీసీ-23.

విభాగాలు: ప్రింటింగ్/ కంట్రోల్, ఇంజినీరింగ్, రిసోర్స్ మేనేజ్‌మెంట్.

➥ సూపర్‌వైజర్ (టీవో- ప్రింటింగ్): 02 పోస్టులుఅర్హత: ప్రథమ శ్రేణిలో డిప్లొమా (ప్రింటింగ్ టెక్నాలజీ) లేదా బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్(ప్రింటింగ్ టెక్నాలజీ).

➥ సూపర్‌వైజర్ (టెక్- కంట్రోల్): 05 పోస్టులుఅర్హత: ప్రథమ శ్రేణిలో డిప్లొమా (ప్రింటింగ్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ) లేదా బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజినీరింగ్ (ప్రింటింగ్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ).

➥ సూపర్‌వైజర్ (ఓఎల్‌): 01 పోస్టుఅర్హత: మాస్టర్స్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్). డిగ్రీస్థాయిలో (హిందీ/ఇంగ్లిష్) ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. హిందీ/ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్ తెలిసి ఉండాలి. ఏడాది అనుభవం ఉండాలి.  

➥ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 12 పోస్టులుఅర్హత: 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ తెలిసి ఉండాలి. నిమిషానికి 40 ఇంగ్లిష్, 40 హిందీ పదాలు టైప్ చేయగలగాలి.

➥ జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/ కంట్రోల్): 68 పోస్టులుఅర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి లేదా డిప్లొమా (ప్రింటింగ్ టెక్నాలజీ) ఉండాలి.

➥ జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్): 03 పోస్టులుఅర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

➥ జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్): 01 పోస్టుఅర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

➥ జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్): 03 పోస్టులుఅర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ (ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్) కలిగి ఉండాలి.

➥ ఫైర్‌మ్యాన్: 01 పోస్టుఅర్హత: పదోతరగతి అర్హతతోపాటు, ఫైర్‌మ్యాన్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. నిర్ణీత ఆరోగ్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి (15.04.2024 నాటికి)..

➥ సూపర్‌వైజర్/ సూపర్‌వైజర్ (టెక్నికల్ కంట్రోల్) పోస్టులకు 18- 30 సంవత్సరాలు; 

➥ జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/ కంట్రోల్), జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్), జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్), జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్) పోస్టులకు 18- 25 సంవత్సరాలు; 

➥ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. 

➥ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; బీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 6-8 సంవత్సరాల వరకు; వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, ఒంటరి మహిళలకు 35 - 40 సంవత్సరాల వరకు; డిఫెన్స్ అభ్యర్థులకు 3 - 8 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. సంస్థ ఉద్యోగులకు ఎలాంటి వయోపరిమితి ఉండదు.

దరఖాస్తు రుసుము: రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.200 చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

ముఖ్య తేదీలు....

➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 15.03.2024.

➥ ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 15.04.2024. 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.04.2024. (23:59 hrs)

➥ పరీక్ష తేదీ: మే/ జూన్-2024.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...