Kendriya Vidyalaya Notification : సికింద్రాబాద్ కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖకి చెందిన బొల్లారం, హకీంపేట కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగులను తీసుకోనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఏ విభాగాల్లో ఖాళీలు, అర్హతలు
- నోటిఫికేషన్‌లో పీజీటీ, టీజీటీ, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లు, ప్రైమరీ టీచర్లు, స్పోర్ట్స్ కోచ్‌లు, డాక్టర్, స్టాఫ్ నర్స్, యోగా కోచ్, స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
- హిందీ, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్, సైన్స్, సోషల్ సైన్స్ వంటి విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్(తత్సమాన) డిగ్రీ లేదా డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఏ/బీఎస్సీ, నర్సింగ్ డిప్లొమా, నర్సింగ్(బీఎస్సీ), ఎంఏ లేదా ఎమ్మెస్సీ, మాస్టర్స్ డిగ్రీ, బీఈ లేదా బీటెక్, డీఈడీ, బీఈడీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు అభ్యర్థులు ఎంసీఐలో రిజిస్టర్ అయి ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపారు.
ఎంపిక ప్రక్రియ
- ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- వాక్‌ఇన్ ఇంటర్వ్యూలను మార్చి 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు.
- ఇంటర్వ్యూలను కేంద్రీయ విద్యాలయం బొల్లారం, అల్లెన్బీ లైన్స్, జేజే నగర్, యాప్రాల్, సికింద్రాబాద్-50087 అడ్రస్‌లో నిర్వహిస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతం రూ. 21,250 నుంచి రూ. 27,500 వరకు చెల్లిస్తారు.
ఇతర కేవీల్లో ఉద్యోగాలు
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంగతన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పీఆర్టీ, టీజీటీ, పీజీటీ, యోగా టీచర్, స్పోర్ట్స్ టీచర్, డ్యాన్స్/మ్యూజిక్ టీచర్, స్పెషల్ ఎడ్యుకేటర్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, కౌన్సెలర్, నర్స్, డీఈవో, డాక్టర్, క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. 2022–23 అకడమిక్ ఇయర్ కు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగులను నియమిస్తున్నారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు అవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థులు సంబంధిత పాఠశాల వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ రోజున అన్ని అకడమిక్ సర్టిఫికేట్లు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లతో ఆయా పాఠశాలలకు వెళ్లాలి. KVS అధికారిక వెబ్‌సైట్ పూర్తి వివరాలు ఉన్నాయి. వెబ్ సైట్ లోని కాంట్రాక్టు ఉద్యోగాల అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేసి కేవీఎస్ దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అవసరమైన అన్ని వివరాలను పూరించి పాఠశాలలో ఆ దరఖాస్తులను సమర్పించాలి. మీ ప్రొఫైల్ షార్ట్‌లిస్ట్ అయితే ఇంటర్వ్యూకి పిలుస్తారు. పూర్తి వివరాలకు https://kvsangathan.nic.in/ను చూడండి.