SECR Recruitment: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2024-25 సంవత్సరానికి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని నాగ్‌పూర్ డివిజన్, మోతిబాగ్ వర్క్‌షాప్(నాగ్‌పూర్)లో యాక్ట్‌ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు అప్రెంటిస్ వెబ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో మే 09లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 861


* యాక్ట్‌ అప్రెంటిస్ పోస్టులు


ట్రేడులు: ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, పీఓపీఏ, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్)/సెక్రెటేరియల్ అసిస్టెంట్, ప్లంబర్, పెయింటర్, వైర్‌మెన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, అపోల్స్టర్(ట్రిమ్మర్), మెషినిస్ట్, టర్నర్, డెంటల్ లాబోరేటరీ టెక్నీషియన్, హాస్పటల్ వేస్ట్ మేనేజ్‌మెంట్, హెల్త్ అండ్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్, గ్యాస్ కట్టర్, స్టెనోగ్రాఫర్ (హిందీ), కేబుల్ జాయింటర్, డ్రైవర్ కమ్ మెకానిక్(లైట్ మోటార్ వైకిల్), మెకానిక్ మెషిన్ టూల్ మెయింటనెన్స్, మాసన్(బిల్డింగ్ కన్‌స్ట్రక్టర్). 


⏩ నాగ్‌పూర్ డివిజన్: 788 పోస్టులు


ట్రేడుల వారీగా ఖాళీలు..


➥ ఫిట్టర్- 90 పోస్టులు


➥ కార్పెంటర్- 30 పోస్టులు


➥ వెల్డర్- 19 పోస్టులు


➥ సీవోపీఏ- 114 పోస్టులు


➥ ఎలక్ట్రీషియన్- 185 పోస్టులు


➥ స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్)/సెక్రెటేరియల్ అసిస్టెంట్- 19 పోస్టులు


➥ ప్లంబర్- 24 పోస్టులు


➥ పెయింటర్- 40 పోస్టులు


➥ వైర్‌మెన్- 60 పోస్టులు


➥ ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 12 పోస్టులు


➥ డిజిల్ మెకానిక్- 90 పోస్టులు


➥ అపోల్స్టర్(ట్రిమ్మర్)- 02 పోస్టులు


➥ మెషినిస్ట్- 22 పోస్టులు


➥ టర్నర్- 10 పోస్టులు


➥ డెంటల్ లాబోరేటరీ టెక్నీషియన్- 01 పోస్టు


➥ హాస్పటల్ వేస్ట్ మేనేజ్‌మెంట్- 02 పోస్టులు


➥ హెల్త్ అండ్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్- 02 పోస్టులు


➥ గ్యాస్ కట్టర్- 07 పోస్టులు


➥ స్టెనోగ్రాఫర్ (హిందీ)- 08 పోస్టులు


➥ కేబుల్ జాయింటర్- 10 పోస్టులు


➥ డ్రైవర్ కమ్ మెకానిక్(లైట్ మోటార్ వైకిల్)- 02 పోస్టులు


➥ మెకానిక్ మెషిన్ టూల్ మెయింటనెన్స్- 12 పోస్టులు


➥ మాసన్(బిల్డింగ్ కన్‌స్ట్రక్టర్)- 27 పోస్టులు


⏩ మోతిబాగ్ వర్క్‌షాప్: 73 పోస్టులు


ట్రేడుల వారీగా ఖాళీలు..


➥ ఫిట్టర్- 35 పోస్టులు


➥ వెల్డర్- 07 పోస్టులు


➥ కార్పెంటర్- 04 పోస్టులు


➥ పెయింటర్- 12 పోస్టులు


➥ టర్నర్- 02 పోస్టులు


➥ సెక్రెటేరియల్ స్టెనోగ్రాఫర్(ఇంగ్లిష్) ప్రాక్టీస్- 03 పోస్టులు


➥ ఎలక్ట్రీషియన్- 10 పోస్టులు


అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 10.04.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా.


స్టైఫెండ్: 2 సంవత్సరాల ఐటీఐ కోర్సుకి రూ.8050. 1 సంవత్సరం ఐటీఐ కోర్సుకి రూ.7700.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 09.05.2024.


Notification


Apprenticeship Application Portal


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..