SCCL Junior Assistant Recruitment 2022: సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ 177 జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు ఎస్‌సీసీఎల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్లరికల్‌ జాబ్‌ నాన్‌ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌లోకి వస్తుంది. ఆసక్తి ఉన్న వాళ్లు అప్లై చేసుకోవచ్చు. 

జూన్ 20 నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. జులై 10 వ తేదీ సాయంత్ర ఐదు గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే ముందు అభ్యర్థులు మొత్తం నోటిఫికేషన్ చదువుకోవాలి. 

నోటిపికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, ఉద్యోగాల వారీగా ఖాళీలు, అప్లికేషన్ ఫీజు, ఎంపిక విధానం మొత్తం చూసుకున్న తర్వాత అప్లై చేయాలి. 

సంక్షిప్తంగా ఉద్యోగ వివరాలు ఉద్యోగం ఇచ్చే సంస్థ పేరు- సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌పోస్ట్ పేరు - జూనియర్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ IIఖాళీల సంఖ్య- 177అప్లికేషన్ స్వీకరణ తేదీ- 20th జూన్ 2022అప్లికేషన్ స్వీకరణకు ఆఖరు తేదీ- 10th జులై 2022అప్లై చేసుకునే విధానం- ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లిచేయాల్సిన సైట్‌- scclmines.com

177 ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసిన సింగరేణి కాలరీస్ కంపెనీ... తన అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఉంచింది. పూర్తి నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే వాళ్లు 200 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఆన్‌లైన్ ద్వారా, క్రెడిట్ డెబిట్, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్, యూపీఏ, ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్టీజీఎస్‌ ద్వారా ఎలాంటి విధానాన్ని అనుసరించైనా చెల్లించవచ్చు. 

అప్లై చేయాల్సి విధానం (ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయాండి)1. ముందుగా అభ్యర్థి అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. 2. అందులో ఉన్న కేరీర్‌ లేదా రిక్రూట్‌మెంట్‌ పేజ్‌పై క్లిక్ చేయాలి. 3. తర్వాత వచ్చే ఆన్‌లైన్‌ అప్లికేషన్‌లో ఎలాంటి తప్పుల్లేకుండా అడిగిన వివరాలు అందివ్వాలి. 4. అన్నింటినీ ఒకసారి సరి చూసుకున్న తర్వాత అప్లికేషన్‌ను సబ్‌మిట్‌ చేయాలి. ఎవరు అర్హులుజూనియర్ అసిస్టెంటట్‌ ఉద్యోగానికి అప్లై చేయడానికి కంప్యూటర్, ఐటీ ఒక సబ్జెక్ట్‌గా డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు, లేదా సాధారణ డిగ్రీ కలిగి ఉండి... ఆరు నెలల పాటు కంప్యూటర్, ఐటీలో సర్టిఫికేట్ కోర్సులు చేసిన వారు కూడా అర్హులే. వయోపరిమితిఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే వారి వయసు 18 ఏళ్లకు పైబడి ఉండాలి. 30 ఏళ్లకు మించి ఉండకూడదు. ఆయా కేటగిరీలకు ప్రత్యేకసడలింపు ఉంటుంది. నోటిఫికేషన్‌లో ఆ వివరాలు పొందుపరిచారు. ఎంపిక విధానం ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం మూడు దశల్లో ఉంటుంది. ముందుగా రాత పరీక్ష ఉంటుంది. అందులో ఎంపికైన వాళ్లకు మెయిన్‌ ఎగ్జామ్ పెడతారు. మెయిన్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే ఇంటర్వ్యూ ఉంటుంది. పరీక్ష కోసం ఏం చదవాలి(పూర్తి సిలబస్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ ఆప్టిట్యూట్‌, జనరల్ స్టడీస్‌, కరెంట్‌ అఫైర్స్, ఇండియ అండ్‌ తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్‌ హెరిటేజ్‌, అర్థమేటిక్‌ అప్టిట్యూడ్‌,, లాజికల్‌ రీజనింగ్‌ పై ప్రశ్నలు ఉంటాయి.