బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గుడ్‌న్యూస్ చెప్పింది. ఎస్‌బీఐలో మొత్తం 69 స్పెషలిస్టు కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు సెప్టెంబర్ 2వ తేదీతో ముగియనుంది. దీని ద్వారా అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ (సివిల్), డిప్యూటీ మేనేజర్ (అగ్రికల్చర్ స్పెషల్), రిలేషన్‌షిప్ మేనేజర్ (ఓఎంపీ) సహా పలు విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనుంది.


ఆసక్తి గల అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షను సెప్టెంబర్‌ 25న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 


Also Read: UBI Recruitment 2021: యూనియన్ బ్యాంకులో 347 ఉద్యోగాలు.. నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలు ఇవే


వయోపరిమితి, దరఖాస్తు ఫీజు..
పోస్టుల ఆధారంగా వయోపరిమితి మారుతోంది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 30 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్, రిలేషన్‌షిప్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్ తదితర పోస్టులకు 25 నుంచి 35 ఏళ్లు, సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ పోస్టులకు 60 ఏళ్ల వరకు వయో పరిమితి ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా వారు రూ.750 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.


ఖాళీల వివరాలు.. 
అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ (సివిల్) - 36
డిప్యూటీ మేనేజర్ (అగ్రికల్చర్ స్పెషల్) - 10
అసిస్టెంట్ మేనేజర్-ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 10
రిలేషన్‌షిప్ మేనేజర్ (ఓఎంపీ) - 6
అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్ & కమ్యూనికేషన్) - 4
ప్రొడక్ట్ మేనేజర్ (ఓఎంపీ) - 2
సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ - 1 


విద్యార్హత వివరాలు.. 



  • అసిస్టెంట్ మేనేజర్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

  • అసిస్టెంట్ మేనేజర్-ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

  • అసిస్టెంట్ మేనేజర్ (మార్కెటింగ్ & కమ్యూనికేషన్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ప్రభుత్వ గుర్తింపు/ఆమోదం పొందిన సంస్థల నుంచి ఫుల్ టైమ్ ఎంబీఏ (మార్కెటింగ్) లేదా దానితో సమానమైన మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్‌ చేసి ఉండాలి.  

  • డిప్యూటీ మేనేజర్ (అగ్రికల్చర్ స్పెషల్) పోస్టులకు.. రూరల్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ లేదా పీజీడీఎం/ అగ్రి బిజినెస్‌లో పీజీడీఎం/ రూరల్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా / గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫుల్ టైం కోర్సుగా అగ్రికల్చర్ పోస్టు గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. 


Also Read: IDBI Recruitment 2021: ఐడీబీఐలో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్..


Also Read: BSF Recruitment 2021: మీరు టెన్త్ పూర్తి చేసి ఉంటే రూ.69,100 జీతం వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయండిలా