దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్, రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ (RBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 868 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అమరావతి పరిధిలో 39 పోస్టులు, హైదరాబాద్ పరిధిలో 48 పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారిని బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేటర్ పోస్టుల్లో నియమించనుంది. బ్యాంకింగ్‌లో అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 10న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 31తో గడువు ముగియనుంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
* పోస్టుల వివరాలు..
మొత్తం పోస్టులు: 868 (అమరావతి-39, హైదరాబాద్-48)
పోస్టుల కేటాయింపు: జనరల్-379, ఎస్సీ-136, ఎస్టీ-57, ఓబీసీ-216, ఈడబ్ల్యూఎస్-80, పీడబ్ల్యూడీ-45.
అర్హతలు: రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులై ఉండాలి. అయితే వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నవారు, సస్పెండ్ అయినవారు, ఉద్యోగానికి రాజీనామా చేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
వయోపరిమితి: 10.03.2023 నాటికి 63 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన షార్ట్‌లిస్టింగ్ కమిటీ షార్ట్‌లిస్టింగ్ నిబంధనలని అనుసరించి అభ్యర్థులు షార్ట్ లిస్ట్ జాబితాను తయారుచేస్తుంది. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. వీరికి 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు సాధారణ కట్-ఆఫ్ నంబర్‌ను పొందినట్లయితే, వారి మెరిట్ వయసు ప్రకారం ఉద్యోగం కేటాయిస్తారు.
కాంట్రాక్ట్ వ్యవధి: ఉద్యోగి పనితీరుపై త్రైమాసిక సమీక్ష నిర్వహిస్తారు. 65 ఏళ్లు నిండిన పదవీ విరమణ చేసిన అధికారులు/సిబ్బందికి ఏది ముందు అయితే.. కాంట్రాక్టు కనిష్టంగా ఒక సంవత్సరం, గరిష్టంగా 3 సంవత్సరాలు ఉంటుంది.
జీతం: ఎంపికైన వారికి నెలకు రూ.40,000 జీతంగా ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.03.2023.
Also Read:
ముంబయి పోర్ట్ అథారిటీలో ప్రాజెక్ట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు - వివరాలు ఇలా!
ముంబయి పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఏప్రిల్ 6 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
TMC: హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్ ఖాళీలు- అర్హతలివే!
వారణాసిలోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్, మహామన పండిట్ మదన్ మోహన్ మాలవీయ క్యాన్సర్ సెంటర్‌లో పలు పోస్టుల భర్తీకి టాటా మెమోరియల్ సెంటర్ దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా మొత్తం 10 సీనియర్ రెసిడెంట్, మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా, పీజీ, ఎండీ, డీఎన్‌బీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 14 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..