దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన పీవో మెయిన్స్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్ మార్చి 10న ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ప్రకటించింది.


ప్రిలిమ్స్ ఉత్తీర్ణులకు జనవరి 30న మెయిన్ ఎగ్జామినేషన్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఫేజ్-3కి సంబంధించి సైకోమెట్రిక్ టెస్టుకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ఎస్‌బీఐ తాజాగా ప్రకటించింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులు గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.



సైకోమెట్రిక్ టెస్ట్: అభ్యర్థుల పర్సనాలిటి ప్రొఫైల్‌ను అంచనా వేయడానికి సైకోమెట్రిక్ పరీక్ష నిర్వహిస్తారు. మొతం 50 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు ఉంటాయి.


తుది ఎంపిక ఇలా:


మొత్తం 300 మార్కులకు తుది ఎంపిక కోసం నిర్ణయించారు. ఇందులో అభ్యర్థులు మెయిన్ పరీక్షలో సాధించిన మార్కులు; గ్రూప్ ఎక్సర్‌సైజ్‌, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. మెయిన్ ఎగ్జామ్‌కు 250 మార్కుల, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 50 మార్కులు ఉంటాయి. ఇక అభ్యర్థుల నార్మలైజ్డ్ మార్కులను మెయిన్ పరీక్షకు 75గా, గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 25 మార్కులుగా నిర్ణయించారు.


నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


Also Read:


టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ (TPBO) పోస్టుల భర్తీకి మార్చి 12న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రాతపరీక్ష హాల్‌టికెట్లను మార్చి 6న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేది వివరాలు నమోదుచేసి పరీక్ష హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 12న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నారు. 
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


గ్రూప్-2 పరీక్ష తేదీ వెల్లడి..
తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరి 28న విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనుంది. పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూలును త్వరలోనే ప్రకటించనున్నారు. పరీక్షలకు వారం ముందునుంచి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ ప్రకటించింది.  తెలంగాణలో గ్రూప్‌-2 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16తో ముగిసిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పోస్టులకు మొత్తం 5,51,943 దరఖాస్తులు అందాయి. అందినట్లు టీఎస్‌పీఎస్‌సీ అధికారులు ప్రకటించారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. చివరి మూడు రోజుల్లోనే 1.10లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం. చివరి రోజు 68వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-2 పరీక్షకు ఒక్కో పోస్టుకు సగటున 705 మందికి చొప్పున పోటీ పడనున్నారు.
గ్రూప్-2 నోటిఫికేషన్, పరీక్ష స్వరూపం కోసం క్లిక్ చేయండి.. 


హెచ్‌ఏఎల్‌లో సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ పోస్టులు - అర్హతలివే!
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) సెక్యూరిటీ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/ బీఎస్సీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. వయసు 35 సంవత్సరాలు మించకూడదు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 15 వరకు దరఖాస్తుచేసుకోవచ్చు. అకడమిక్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...