ఎస్‌బీఐ క్లర్క్-2022 ప్రిలిమినరీ పరీక్ష అడ్మిట్ కార్డులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పాస్‌వర్డ్/పుట్టినతేది వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు పొందవచ్చు. నవంబరు 25 వరకు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ప్రిలిమినరీ పరీక్ష తేదిని అధికారులు ఇంతవరకు వెల్లడించలేదు. నవంబరు రెండోవారంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అలాగే డిసెంబరు లేదా జనవరిలో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.


SBI ప్రిలిమినరీ పరీక్ష అడ్మిట్ కార్డు కోసం క్లిక్ చేయండి..


పరీక్ష విధానం: 


I. ప్రిలిమినరీ పరీక్ష:  
మొత్తం 100 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్  లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులకు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులకు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట. పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రధాన పరీక్షకు అభ్యర్థులను ఎంపికచేస్తారు. 


II. మెయిన్ ఎగ్జామ్:
మొత్తం 200 మార్కులకు మెయిన్ పరీక్ష ఉంటుంది. మొత్తం 190  ప్రశ్నలు ఉంటాయి. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్  50 ప్రశ్నలు-50 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు-40 మార్కులు; క్వాంటిటేటివ్  అప్టిట్యూడ్  50 ప్రశ్నలు-50 మార్కులు; రీజనింగ్  ఎబిలిటీ అండ్ కంప్యూటర్  అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటల 40 నిమిషాలు.   


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు:  అనంతపూర్, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగరం, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్.  


SBI Clerks 2022 నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


NHB Recruitment: నేషనల్ హౌసింగ్ బ్యాంకులో ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
న్యూఢిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్, రెగ్యులర్ విధానంలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్‌హెచ్‌బీలో ఉద్యోగాల భర్తీకి అక్టోబరు 29 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. నవంబరు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు, ఇంజినీరింగ్ అర్హత ఉంటే చాలు!
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాంట్రాక్ట్ విధానంలో ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 9లోపు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. 
 నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...