SBI CBO Recruitment: ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ సర్కిళ్లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 5447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (Circle Based Officer) పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో రెగ్యులర్ పోస్టులు-5280, బ్యాక్‌లాగ్ పోస్టులు-167 ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్‌లో 425, అమరావతి సర్కిల్‌లో 400 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సర్కిల్/ రాష్ట్రంలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


వివరాలు...


* సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 5447 (రెగ్యులర్ పోస్టులు - 5280, బ్యాక్‌లాగ్ పోస్టులు - 167).


తెలుగు రాష్ట్రాల పరిధిలో ఖాళీలు: అమరావతి - 400, హైదరాబాద్ - 425.


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.]


వయోపరిమితి: 30.09.2022 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 - 15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలపాలు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.


జీతభత్యాలు:  రూ.36,000 - రూ.63,840.


పరీక్ష విధానం:


✪ మొత్తం 120 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో 120 ప్రశ్నలు అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్- 30 ప్రశ్నలు-30 మార్కులు,  బ్యాంకింగ్ నాలెడ్జ్-40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్/ఎకానమీ-30 ప్రశ్నలు-30 మార్కులు, కంప్యూటర్ ఆప్టిట్యూడ్-20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. 


✪ అదేవిధంగా 50 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ (లెటర్ రైటింగ్, ఎస్సే) ఉంటుంది. పరీక్ష సమయం 30 నిమిషాలు.


✪ ఇక ఇంటర్యూకు 50 మార్కులు కేటాయించారు.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు.


ముఖ్యమైన తేదీలు..


✪ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 22.11.2023.


✪ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: ‌12.12.2023.


✪ అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: జనవరి 2024.


✪ ఆన్‌లైన్ పరీక్ష తేది: జనవరి 2024.


Website 


                           


ALSO READ:


ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
ఎస్‍బీఐ పీవో ప్రిలిమ్స్-2023 (Prelims) ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) నవంబరు 21న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్/రోల్ నెంబర్, పుట్టినతేది వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబరు 5న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..