SAMEER Recruitment: ముంబయిలోని సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రిసెర్చ్ కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్, రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 104 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 16 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 104
⏩ ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్/ మెడికల్): 20 పోస్టులు
⏩ ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఫిజిక్స్): 02 పోస్టులు
⏩ ప్రాజెక్ట్ అసిస్టెంట్ (మెకానికల్): 05 పోస్టులు
⏩ ప్రాజెక్ట్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్-మెకానిక్): 15 పోస్టులు
⏩ ప్రాజెక్ట్ టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్): 01 పోస్టు
⏩ ప్రాజెక్ట్ టెక్నీషియన్ (ఫిట్టర్): 08 పోస్టులు
⏩ ప్రాజెక్ట్ టెక్నీషియన్ (మెషినిస్ట్): 01 పోస్టు
⏩ ప్రాజెక్ట్ టెక్నీషియన్ (వెల్డర్): 02 పోస్టులు
⏩ ప్రాజెక్ట్ టెక్నీషియన్ (ఎలక్ట్రో-ప్లేటర్): 02 పోస్టులు
⏩ సీనియర్ రిసెర్చ్ సైంటిస్ట్ (ఎలక్ట్రానిక్స్): 03 పోస్టులు
⏩ సీనియర్ రిసెర్చ్ సైంటిస్ట్ (ఫిజిక్స్): 02 పోస్టులు
⏩ రిసెర్చ్ సైంటిస్ట్ (ఆర్‌ఎఫ్ & మైక్రోవేవ్స్): 06 పోస్టులు
⏩ రిసెర్చ్ సైంటిస్ట్ (ఎలక్ట్రానిక్స్): 26 పోస్టులు
⏩ రిసెర్చ్ సైంటిస్ట్ (ఫిజిక్స్): 04 పోస్టులు
⏩ రిసెర్చ్ సైంటిస్ట్ (సేఫ్టీ ఎలక్ట్రానిక్స్/ ల్యాబ్): 01 పోస్టు
⏩ రిసెర్చ్ సైంటిస్ట్ (కంప్యూటర్స్ అండ్ ఐటీ): 03 పోస్టులు
⏩ రిసెర్చ్ సైంటిస్ట్ (మెకానికల్) ఆర్‌ఎస్-ఎంఈ: 03 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులకు 30 సంవత్సరాలు, సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులకు 35 సంవత్సరాలు, ప్రాజెక్ట్ అసిస్టెంట్(ఎ) మరియు ప్రాజెక్ట్ టెక్నీషియన్(ఎ) పోస్టులకు 25 సంవత్సరాలు, ప్రాజెక్ట్ అసిస్టెంట్(బి) మరియు ప్రాజెక్ట్ టెక్నీషియన్(బి) పోస్టులకు 35 సంవత్సరాలు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ (సి) మరియు ప్రాజెక్ట్ టెక్నీషియన్ (సి) పోస్టులకు 35 సంవత్సరాలు ఉండాలి.
కాంట్రాక్ట్ వ్యవధి: 2 సంవత్సరాల ఒప్పందం లేదా ప్రాజెక్ట్ వ్యవధి, ఏది తక్కువైతే అది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతం:
సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్: 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న అభ్యర్థులకు నెలకు రూ. 39,200.
రీసెర్చ్ సైంటిస్ట్: నెలకు రూ.30,000.
ప్రాజెక్ట్ అసిస్టెంట్(ఎ): నెలకు రూ.17,000.
ప్రాజెక్ట్ అసిస్టెంట్(బి): 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.21,500.
ప్రాజెక్ట్ అసిస్టెంట్(సి): 8 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.27,000.
ప్రాజెక్ట్ టెక్నీషియన్(ఎ): నెలకు రూ.15,100.
ప్రాజెక్ట్ టెక్నీషియన్ (బి): 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.19,100.
ప్రాజెక్ట్ టెక్నీషియన్(సి): 8 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న అభ్యర్థులకు నెలకు రూ.23,600.
జతపరచవలసిన డాక్యుమెంట్స్..
➥ పుట్టిన తేదీ ద్రువీకరణ పత్రం.
➥ పాస్ పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్.
➥ 10th స్టాండర్డ్ మార్క్ లిస్ట్.
➥ 12th స్టాండర్డ్ మార్క్ లిస్ట్.
➥ ITI సర్టిఫికేట్ (ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టులకు).
➥ NCTVT సర్టిఫికేట్ (ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టులకు).
➥ అర్హత పరీక్ష ఉత్తీర్ణత సర్టిఫికేట్ (అప్లై చేసిన పోస్ట్ ప్రకారం).
➥ అన్ని సంవత్సరాలకు అర్హత పరీక్ష మార్కులు (అప్లై చేసిన పోస్ట్ ప్రకారం).
➥ అనుభవ ధృవీకరణ పత్రం (సరిగ్గా సంతకం చేసి స్టాంప్ చేయబడింది).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16.01.2024.