Sainik School Kalikiri: కలికిరి- సైనిక్‌ స్కూల్‌లో టీచింగ్‌ పోస్టులు

అన్నమయ్య జిల్లా కలికిరిలోని సైనిక్ స్కూల్ ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Continues below advertisement

అన్నమయ్య జిల్లా కలికిరిలోని సైనిక్ స్కూల్ ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, టెట్‌/ సీటెట్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 6 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అర్హతలు, అనుభవం, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Continues below advertisement

వివరాలు..

* టీచింగ్‌ పోస్టులు

➥ పీజీటీ (కంప్యూటర్‌ సైన్సు) - 01

➥ టీజీటీ (సోషల్‌ సైన్సు) - 01

➥ పీటీఐ కమ్‌ మాట్రన్‌(మహిళలు) - 01

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, టెట్‌/ సీటెట్‌ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 06.11.2023 నాటికి పీజీటీ: 21-40 సంవత్సరాలు, టీజీటీ/పీటీఐ కమ్‌ మాట్రన్‌: 21-35 సంవత్సరాలు ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. Principal, Sainik School Kalikiri పేరిట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కలికిరి బ్రాంచ్ (కోడ్: 016427)లో నిర్ణీత మొత్తంతో డిడి తీయాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం, రిజర్వేషన్ల ఆధారంగా.

జీతం: పీజీటీ: రూ.62,356, టీజీటీ/పీటీఐ కమ్‌ మాట్రన్‌: రూ.58,819.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
The Principal, Sainik
School Kalikiri, Annamayya Dist, 
Andhra Pradesh PIN: 517234.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 06.11.2023.

Notification

Application

ALSO READ:

బీహెచ్‌ఈఎల్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, సూపర్‌వైజర్ పోస్టులు - ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అర్హతలు
బెంగ‌ళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్‌), తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ పోస్టులకు డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 1 వరకు దరఖాస్తులు సమర్పించి, నవంబరు 4లోగా నిర్ణీత చిరునామాకు దరఖాస్తు హార్డ్ కాపీలను పంపాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(ఏఎఫ్‌ఎంఎస్) మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 650 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 ఉద్యోగాల దరఖాస్తులు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో  677 సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 14న ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన వారు నవంబరు 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరతగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి.  అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్థులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. టైర్-1, టైర్-2 రాతపరీక్షల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. 
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola