అన్నమయ్య జిల్లా కలికిరిలోని సైనిక్ స్కూల్ ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్, క్రాఫ్ట్ టీచర్, కౌన్సెలర్, హార్స్ రైడర్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి ఇంటర్, ఎంబీబీఎస్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 6 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అర్హతలు, అనుభవం, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు..
➥ స్కూల్ మెడికల్ ఆఫీసర్
➥ ఆర్ట్ కమ్ క్రాఫ్ట్ టీచర్
➥ కౌన్సెలర్
➥ హార్స్ రైడర్ ఇన్‌స్ట్రక్టర్
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, ఎంబీబీఎస్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 06.11.2023 నాటికి స్కూల్ మెడికల్ ఆఫీసర్: 50 సంవత్సరాలు మించకూడదు, ఆర్ట్ కం క్రాఫ్ట్ టీచర్: 21-35 సంవత్సరాలు, కౌన్సెలర్: 26-45 సంవత్సరాలు , హార్స్ రైడర్ ఇన్‌స్ట్రక్టర్: 21-50 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. Principal, Sainik School Kalikiri పేరిట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కలికిరి బ్రాంచ్ (కోడ్: 016427)లో నిర్ణీత మొత్తంతో డిడి తీయాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం, రిజర్వేషన్ల ఆధారంగా.
జీతం: స్కూల్ మెడికల్ ఆఫీసర్: రూ.73,491, ఆర్ట్ కమ్ క్రాఫ్ట్ టీచర్/కౌన్సెలర్: రూ.58,819, హార్స్ రైడర్ ఇన్‌స్ట్రక్టర్: రూ.38,252
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Principal, Sainik
School Kalikiri, Annamayya Dist,
Andhra Pradesh PIN: 517234.
ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరితేది: 06.11.2023.
ALSO READ:
శ్రీహరికోట-సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఎస్డీఎస్సీ షార్ సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 03 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
బీహెచ్‌ఈఎల్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టులు - ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అర్హతలు
బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్), తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ పోస్టులకు డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 1 వరకు దరఖాస్తులు సమర్పించి, నవంబరు 4లోగా నిర్ణీత చిరునామాకు దరఖాస్తు హార్డ్ కాపీలను పంపాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(ఏఎఫ్‌ఎంఎస్) మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 650 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..