SAIL IISCO Steel Plant Recruitment: బర్న్‌పూర్(పశ్చిమ బెంగాల్)లోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL)- ఐఐఎస్‌సీవో స్టీల్ ప్లాంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్‌లో అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (Attendant-cum-Technician), ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ (Operator-cum-Technician) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 49 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

మొత్తం ఖాళీలు: 49

* నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

⏩ అటెండెంట్-కమ్-టెక్నీషియన్ (ట్రైనీ): 40 పోస్టులు

➥ ఫిట్టర్: 06

➥ ఎలక్ట్రీషియన్: 12

➥ టర్నర్: 03

➥ EOT క్రేన్ ఆపరేటర్: 09

➥ వెల్డర్: 05

➥ హెవీ వెహికల్ డ్రైవర్: 05

⏩ ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేషన్) (ఎస్‌-3): 03 పోస్టులు

➥ బాయిలర్ ఆపరేషన్: 03

⏩ అటెండెంట్-కమ్-టెక్నీషియన్ (బాయిలర్ అటెండెంట్) (ఎస్‌-1): 03 పోస్టులు

➥ బాయిలర్ అటెండెంట్: 03

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18.01.2024 నాటికి ఆపరేటర్-కమ్ టెక్నీషియన్‌కు 30 సంవత్సరాలు; అటెండెంట్-కమ్ టెక్నీషియన్‌కు 28 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: ఆపరేటర్-కమ్-టెక్నీషియన్(బాయిలర్ ఆపరేషన్) యూఆర్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈఎస్‌ఎం/డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు రూ.150, అటెండెంట్-కమ్-టెక్నీషియన్(ట్రైనీ) యూఆర్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈఎస్‌ఎం/డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు రూ.100, అటెండెంట్-కమ్-టెక్నీషియన్(బాయిలర్ అటెండెంట్) యూఆర్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈఎస్‌ఎం/డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు రూ.100.

ఫిజికల్ స్టాండర్డ్స్: 

ఎత్తు: మేల్- 155 cm, ఫిమేల్- 143 cm

బరువు: మేల్- 45kg, ఫిమేల్- 35kg. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

పే స్కేల్: నెలకు అటెండెంట్-కమ్-టెక్నీషియన్‌కు రూ.25,070 – రూ.35,070. ఆపరేటర్-కమ్-టెక్నీషియన్‌కు రూ.26,600 – రూ.38,920.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.01.2024.

Nitification

Website

                                         

ALSO READ:

ఇస్రో-స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులు, ఈ అర్హతలుండాలిఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ఆధ్వర్యంలోని 'స్పేస్ అప్లికేషన్ సెంటర్-అహ్మదాబాద్' ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో ఇంజినీర్/ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కనీసం 65 శాతం మార్కులతో బీఈ/ బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంఎస్సీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 15లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...