న్యూఢిల్లీలోని టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం(టీఓపీఎస్) విభాగం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 53 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జులై 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 53


1. హెడ్(రిసెర్చ్‌, పాలసీ, లెర్నింగ్): 01 


2. సీనియర్ లీడ్(పాలసీ అండ్ లెర్నింగ్): 01 


3. మేనేజర్(కమ్యూనికేషన్): 01 


4. లీడ్(రిసెర్చ్‌): 15 


5. మేనేజర్(అథ్లెట్ రిలేషన్): 26 


6. మేనేజర్(పార్ట్‌నర్‌షిప్‌): 01 


7. స్పోర్ట్స్ అసోసియేట్: 08 


అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 


వయోపరిమితి: హెడ్(రిసెర్చ్‌, పాలసీ, లెర్నింగ్) పోస్టుకి 50 సంవత్సరాలు, సీనియర్ లీడ్ (పాలసీ అండ్ లెర్నింగ్) పోస్టుకి 45 సంవత్సరాలు, మిగతా పోస్టులకి 32 సంవత్సరాలు మించకూడదు. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


జీతం: నెలకు హెడ్(రిసెర్చ్‌, పాలసీ, లెర్నింగ్): రూ.1,45,000- రూ.2,65,000; సీనియర్ లీడ్(పాలసీ అండ్ లెర్నింగ్): రూ.80,000- రూ.1,45,000; మేనేజర్ (కమ్యూనికేషన్): రూ.50,000- రూ.70,000; లీడ్ (రిసెర్చ్‌): రూ.60,000-రూ.80,000; మేనేజర్(అథ్లెట్ రిలేషన్): రూ.50,000-రూ.70,000; మేనేజర్(పార్ట్‌నర్‌షిప్‌): రూ.50,000-రూ.70,000; స్పోర్ట్స్ అసోసియేట్: రూ.45,000-రూ.60,000. 


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15.06.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.07.2023.


Notification


Website



Also Read:


తెలంగాణ కేజీబీవీల్లో 1241 ఉద్యోగాలు - అర్హతలు, ఎంపిక విధానం ఇలా!
తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ (యూఆర్‌ఎఎస్‌)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1,241 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో స్పెషల్‌ ఆఫీసర్‌, పీజీసీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీలు పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జూన్ 26 నుంచి జులై 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో 43 ఐటీ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(ఐపీపీబీ) ఒప్పంద ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈ, బీటెక్‌(కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికి జులై 03 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నాగ్‌పూర్‌ ఎయిమ్స్‌లో 73 సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు, అర్హతలివే!
నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) వివిధ విభాగాలో ఖాళీగా ఉన్న సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ జూన్ 9న ప్రారంభమైంది. జులై 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial