Meta new hire Rs 1670 crore paycheck: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లో తనదైన ముద్ర వేయాలని తాపత్రయ పడుతున్న మెటా  చీఫ్ జుకర్ బెర్గ్ .. జీతాలు ఎంత కావాలంటే అంత ఇచ్చి ప్రతిభావంతులైన ఇంజినీర్లను ఎంపిక చేసుకుంటున్నారు.  ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్   మాతృ సంస్థ అయిన మెటా, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) అభివృద్ధిలో OpenAI, గూగుల్ డీప్‌మైండ్,   ఆంత్రోపిక్ వంటి సంస్థలతో పోటీపడేందుకు  ఏకీకృతం చేస్తోంది. మెటా  సూపర్‌ఇంటెలిజెన్స్ లాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్ నాయకత్వంలో  అత్యుత్తమ AI  ఇంజినీర్లను తమ సంస్థలో చేర్చుకుంటోంది. ఇందు కోసం భారీ మొత్తాలను ఆఫర్ చేస్తోంది. 

Continues below advertisement


తాజాగా  మెటా, ఆపిల్‌లో AI మోడల్స్ టీమ్ హెడ్‌గా పనిచేసిన రూమింగ్ పాంగ్‌ను  200 మిలియన్ డాలర్లు అంటే  సుమారు రూ. 1,670 కోట్లు  ఆఫర్‌తో నియమించింది. ఈ ఆఫర్‌లో భారీ బేస్ శాలరీ, సైనింగ్ బోనస్,   మెటా స్టాక్‌లు ఉన్నాయి. గత వారం భారత సంతతి ఇంజినీర్  ట్రాపిట్ బన్సల్ కు ఇలాంటి ఆఫరే ఇచ్చి చేర్చుకున్నారు.  ఓపెన్‌AI   మాజీ పరిశోధకుడు , IIT కాన్పూర్ గ్రాడ్యుయేట్ అయిన ట్రాపిట్ బన్సల్‌ను మెటా  100 మిలియన్ డాలర్లు అంటే  సుమారు రూ. 800 కోట్ల ఆఫర్‌తో నియమించింది. బన్సల్, ఓపెన్‌AI  "O-సిరీస్" రీజనింగ్ మోడల్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.   ఓపెన్‌AI సహ-స్థాపకుడు ఇలియా సుట్స్‌కెవర్‌తో కలిసి పనిచేశారు.


 ట్రాపిట్ బన్సల్ ఉత్తర ప్రదేశ్ లో పుట్టి పెరిగారు.   IIT కాన్పూర్ నుండి గ్రాడ్యుయేషన్ చేశారు.  యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్ అమ్హెర్స్ట్ నుండి కంప్యూటర్ సైన్స్‌లో Ph.D. పొందారు. డీప్ లెర్నింగ్, మెటా-లెర్నింగ్,  నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP)లో స్పెషలైజ్ చేశారు. ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్,   ఓపెన్‌AIలో ఇంటర్న్‌షిప్‌లు చేశారు. 2022లో ఓపెన్‌AIలో ఫుల్-టైమ్ సభ్యుడిగా చేరి, రీఇన్‌ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ (RL) , AI రీజనింగ్ మోడల్ "o1" అభివృద్ధిలో సహకరించారు. మెటాలో చేరడం థ్రిల్లింగ్‌గా ఉంది! సూపర్‌ఇంటెలిజెన్స్ ఇప్పుడు దృష్టిలో ఉంది  " అని  సోషల్ మీడియాలో ప్రకటించారు. 


 సిలికాన్ వ్యాలీలో AI టాలెంట్ కోసం తీవ్ర పోటీ నడుస్తోంది.  మెటా ఈ రేసులో ముందంజలో ఉంది. బన్సల్‌తో పాటు, మెటా ఓపెన్‌AI, ఆంత్రోపిక్, డీప్‌మైండ్ నుండి లూకాస్ బేయర్, జాక్ రే, జోహన్ షాల్క్‌వైక్ వంటి ఇతర ప్రముఖ పరిశోధకులను కూడా నియమించింది.  బ్లూమ్‌బర్గ్ ,  ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికల ప్రకారం, మెటా నాలుగు సంవత్సరాలకు  300 మిలియన్ డాలర్ల  వరకు ఆఫర్‌లు ఇస్తోంది. ఇందులో స్టాక్ ఆప్షన్స్ , భారీ కంప్యూట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్ ఉన్నాయి.  ఓపెన్‌AI CEO సామ్ ఆల్ట్‌మన్, మెటా 100  మిలియన్ డాలర్ల సైనింగ్ బోనస్‌లు ఆఫర్ చేస్తోందని, కానీ తమ ఉత్తమ ఉద్యోగులు ఆ ఆఫర్‌లను తిరస్కరించారని చెబుతున్నారు. 


మెటా   సూపర్‌ఇంటెలిజెన్స్ లాబ్స్, ఎక్స్-స్కేల్ AI CEO అలెగ్జాండర్ వాంగ్ ,  ఎక్స్-గిట్‌హబ్ CEO నాట్ ఫ్రీడ్‌మన్ నాయకత్వంలో ఉంది. ఈ లాబ్స్ లక్ష్యం ఓపెన్‌AI  o3 లేదా డీప్‌సీక్   R1 వంటి అధునాతన AI రీజనింగ్ మోడల్స్‌ను అభివృద్ధి చేయడం. మెటా, స్కేల్ AIలో 49% వాటాను $14.3 బిలియన్‌కు కొనుగోలు చేసింది.