North Eastern Railway RRC Apprentice Recruitment: గోరఖ్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) నార్త్ ఈస్ట్రన్ రైల్వే (NER) పరిధిలోని వివిధ వర్క్‌షాప్/ యూనిట్లలో అప్రెంటిస్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1104 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నార్త్ ఈస్ట్రన్ రైల్వే పరిధికి సంబంధించి గోరఖ్‌పూర్‌లో మెకానికల్ వర్క్‌షాప్, గోరఖ్‌పూర్ కంటోన్మెంట్‌లో సిగ్నల్ వర్క్‌షాప్, బ్రిడ్జ్ వర్క్‌షాప్ ఖాళీలు ఉన్నాయి, అలాగే ఇజ్జత్‌నగర్‌లో మెకానికల్ వర్క్‌షాప్, డీజిల్ షెడ్, క్యారేజ్ అండ్ వ్యాగన్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. వీటితోపాటు క్యారేజ్ అండ్ వ్యాగన్ (లఖ్‌నవూ జంక్షన్), డీజిల్ షెడ్ (గోండా), క్యారేజ్ అండ్ వ్యాగన్ (వారణాసి) యూనిట్‌లో ఖాళీలు ఉన్నాయి. సరైన అర్హతలున్న అభ్యర్థులు జులై 11 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 1104
పోస్టుల కేటాయింపు: యూఆర్ (జనరల్)-454, ఈడబ్ల్యూఎస్-110, ఎస్సీ-165, ఎస్టీ-81, ఓబీసీ-294. మొత్తం ఖాళీల్లో ఎక్స్-సర్వీస్‌మెన్-34, దివ్యాంగులు-44 పోస్టులు కేటాయించారు.
శిక్షణ కాలం: ఏడాది.
వర్క్‌షాప్/ యూనిట్: మెకానికల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్), సిగ్నల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్), బ్రిడ్జ్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్), మెకానికల్ వర్క్‌షాప్ (ఇజ్జత్‌నగర్), డీజిల్ షెడ్ (ఇజ్జత్‌నగర్), క్యారేజ్ అండ్ వ్యాగన్ (ఇజ్జత్‌నగర్), క్యారేజ్ అండ్ వ్యాగన్ (లఖ్‌నవూ జంక్షన్), డీజిల్ షెడ్ (గోండా), క్యారేజ్ అండ్ వ్యాగన్ (వారణాసి).
వర్క్‌షాప్/ యూనిట్‌ల వారీగా ఖాళీలు..
⫸ మెకానికల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్): 411 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-140, వెల్డర్-62, ఎలక్ట్రీషియన్-17, కార్పెంటర్-89, పెయింటర్-87, మెషినిస్ట్-16.
⫸ సిగ్నల్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్): 63 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-31, వెల్డర్-08, టర్నర్-15, కార్పెంటర్-03, మెషినిస్ట్-06.
⫸ బ్రిడ్జ్ వర్క్‌షాప్ (గోరఖ్‌పూర్ కంటోన్మెంట్): 35 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-21, వెల్డర్-11, మెషినిస్ట్-03.
⫸ మెకానికల్ వర్క్‌షాప్ (ఇజ్జత్ నగర్): 151 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు: ఫిట్టర్-39, వెల్డర్-30, ఎలక్ట్రీషియన్-32, కార్పెంటర్-39, పెయింటర్-11.
⫸ డీజిల్ షెడ్ (ఇజ్జత్ నగర్): 60 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రీషియన్-30, మెకానికల్ డీజిల్-30.
⫸ క్యారేజ్ అండ్ వ్యాగన్ (ఇజ్జత్ నగర్): 64 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు: ఫిట్టర్-64.
⫸ క్యారేజ్ అండ్ వ్యాగన్ (లక్నో జంక్షన్): 155 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-120, వెల్డర్-06, ట్రిమ్మర్-06, కార్పెంటర్-11, పెయింటర్-06, మెషినిస్ట్-06.
⫸ డీజిల్ షెడ్ (గోండా): 90 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-13, వెల్డర్-02, ఎలక్ట్రీషియన్-20, మెకానిక్ డీజిల్-55.
⫸ క్యారేజ్ అండ్ వ్యాగన్ (వారణాసి): 75 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు: ఫిట్టర్-66, వెల్డర్-02, కార్పెంటర్-03, ట్రిమ్మర్-02, పెయింటర్-02.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 12.06.2024 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా.
స్టైపెండ్: ఎంపికైనవారికి నిబంధనల మేరకు శిక్షణ కాలంలో స్టైపెండ్ చెల్లిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 11.07.2024.
ALSO READ: ఇండియన్ కోస్ట్‌గార్డులో 320 నావిక్, యాంత్రిక్ పోస్టులు