Indian Coast Guard Recruitment: ఇండియన్ కోస్ట్‌గార్డు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 320 నావిక్ (జనరల్ డ్యూటీ), యాంత్రిక్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి 12వ తరగతి (మ్యాథ్స్/ ఫిజిక్స్), 10వ తరగతి లేదా 12వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కోస్ట్ గార్డ్ ఎన్‌రోల్డ్ పర్సనల్ టెస్ట్ (సీజీఈపీటీ)-01/ 2025 బ్యాచ్ ద్వారా అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. సరైన అర్హతలున్నవారు జులై 3 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారు శిక్షణ అనంతరం ఉద్యోగాల్లో చేరతారు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 320
1. నావిక్(జనరల్ డ్యూటీ): 260 పోస్టులు
రీజియన్/ జోన్ వారీగా ఖాళీలు..
➥ నార్త్: 77
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 30, ఈడబ్ల్యూఎస్- 08, ఓబీసీ- 24, ఎస్టీ- 03, ఎస్సీ- 12.
➥ వెస్ట్: 66
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 26, ఈడబ్ల్యూఎస్- 06, ఓబీసీ- 21, ఎస్టీ- 03, ఎస్సీ- 10.
➥ నార్త్ ఈస్ట్: 68
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 27, ఈడబ్ల్యూఎస్- 07, ఓబీసీ- 21, ఎస్టీ- 03, ఎస్సీ- 10.
➥ ఈస్ట్: 34
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 13, ఈడబ్ల్యూఎస్- 03, ఓబీసీ- 11, ఎస్టీ- 01, ఎస్సీ- 06.
➥ నార్త్ వెస్ట్: 12
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 05, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ- 04, ఎస్టీ- 00, ఎస్సీ- 01.
➥ అండమాన్ అండ్ నికోబార్: 03.
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 01, ఈడబ్ల్యూఎస్- 00, ఓబీసీ- 01, ఎస్టీ- 00, ఎస్సీ- 01.
అర్హత: కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (COBSE)చే గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి 12వ తరగతి (మ్యాథ్స్/ ఫిజిక్స్) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అనగా 01.03.2003 నుంచి 28.02.2007 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
ALSO READ: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 214 ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
2. యాంత్రిక్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్): 60 పోస్టులు.
విభాగాలవారీగా ఖాళీలు..
➥ మెకానికల్: 33
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 16, ఈడబ్ల్యూఎస్- 00, ఓబీసీ- 07, ఎస్టీ- 06, ఎస్సీ- 04.
➥ ఎలక్ట్రికల్: 18
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 11, ఈడబ్ల్యూఎస్- 00, ఓబీసీ- 04, ఎస్టీ- 00, ఎస్సీ- 01.
➥ ఎలక్ట్రానిక్స్: 09
రిజర్వ్ కేటగిరీ: జనరల్- 05, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ- 04, ఎస్టీ- 00, ఎస్సీ- 03.
అర్హత: 10వ తరగతి లేదా 12వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 - 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అనగా 01.03.2003 నుంచి 28.02.2007 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
పరీక్ష ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలలో భాగంగా, రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
బేసిక్ పే: నెలకు నావిక్ పోస్టులకు రూ.21,700. యాంత్రిక్ పోస్టులకు రూ.29,200.
ముఖ్యమైన తేదీలు...
✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.06.2024.
✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.07.2024.
పరీక్ష తేదీలు/ ఈ-అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్..
✦ స్టేజ్-I: సెప్టెంబర్ 2024.
✦ స్టేజ్-II: నవంబర్ 2024.
✦ స్టేజ్-III: ఏప్రిల్ 2024.