ఈస్టర్న్ రైల్వే ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఈస్టర్న్ రైల్వే పరిధిలోని వివిధ డివిజన్లలో ఖాళీగా ఉన్న మొత్తం 3115 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 27న ప్రారంభంకాగా.. అక్టోబరు 26 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

వివరాలు..

* అప్రెంటిస్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 3115

డివిజన్లవారీగా ఖాళీలు:

➥ హౌరా డివిజన్: 659

➥ లిలుహ్ డివిజన్: 612

➥ సీల్దా డివిజన్: 440

➥ కం చరపర వర్క్‌ షాప్: 187

➥ మాల్డా డివిజన్: 138

➥ అసన్సో ల్ డివిజన్: 412

➥ జమాల్‌పూర్ వర్క్‌ షాప్-667

విభాగాలు: ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, పెయింటర్, వైర్‌మెన్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, కార్పెంటర్, లైన్ మ్యాన్, రిఫ్రిజిరేటర్ & ఏసీ మెకానిక్, మాసన్, బ్లాక్ స్మిత్, 

అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉండాలి.

వయోపరిమితి: 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రిజర్వేషన్, ఇతర అర్హతల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.09.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 26.10.2023.

Notification

Online Application

Website

ALSO READ:

Vizag Port: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలివిశాఖపట్నంలోని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 24లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.అప్రెంటిస్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,140 ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీలు, అర్హతలివేమధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీలోని కేంద్ర ప్రభుత్వ మినీ రత్న కంపెనీగా ఉన్న నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 1140 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెట్రిక్యులేషన్‌తో పాటు ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 15 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అడకమిక్ మెరిట్, రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.అప్రెంటిస్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

వీసీఆర్‌సీలో 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులు - అర్హతలివే!పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్‌- వెక్టర్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్, డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన టెక్నికల్ కేడర్‌లో రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 71 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతారు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..