RRB JE Vacancy 2026: ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న ఇంజనీరింగ్, డిప్లొమా, డిగ్రీ హోల్డర్లకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపర్నింటెండెంట్ సహా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 3,993 పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తులు ఆగస్టు 14 నుంచి ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు.

Continues below advertisement

3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఆర్‌ఆర్‌బీ జేఈ (RRB JE Posts) భర్తీ 2026 నోటిఫికేషన్‌లో జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపర్నింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇతర సంబంధిత ఇంజనీరింగ్ విభాగాలకు చెందినవి. మొత్తం 3,993 ఖాళీలలో కేటగిరీల వారీగా చూస్తే జనరల్ కేటగిరీలో 1,699 పోస్టులు, ఎస్సీలకు 624 పోస్టులు, ఎస్టీలకి 363 పోస్టులు, ఓబీసీకి 913 పోస్టులు కేటాయించగా.. ఈడబ్ల్యూఎస్‌కి 394 పోస్టులు ఉన్నాయి. 

Continues below advertisement

ఏ పోస్టుకు ఏ అర్హత?జూనియర్ ఇంజనీర్ పోస్టుకు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి 3 సంవత్సరాల డిప్లొమా లేదా సంబంధిత విభాగంలో BE/ B.Tech డిగ్రీ కలిగి ఉండాలి. అదే సమయంలో డిపో మెటీరియల్ సూపర్నింటెండెంట్ పోస్టుకు ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థి విద్యార్హతలు దరఖాస్తు చివరి తేదీ అయిన 13 సెప్టెంబర్ 2026 నాటికి పూర్తయి ఉండాలని గుర్తుంచుకోండి. చివరి సంవత్సర పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు కారని స్పష్టం చేశారు.

ఏజ్ లిమిట్ 18 నుంచి 33 సంవత్సరాలు ఆర్‌ఆర్‌బీ జేఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థి వయస్సు 1 జనవరి 2027 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ (ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ లిమిట్ సడలింపు లభిస్తుంది. పీడబ్ల్యూబీడీ కేటగిరీ, మాజీ సైనికులు, రైల్వే ఉద్యోగులతో సహా ఇతర కేటగిరీలకు నిబంధనల ప్రకారం ఏజ్ లిమిట్ సడలింపు చేశారు. 

Also Read: Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!

ముఖ్యమైన తేదీలివే..ఆర్‌ఆర్‌బీ జేఈ 2026 వివరణాత్మక నోటిఫికేషన్ ఆగస్టు 13న విడుదల కాగా.. ఆన్‌లైన్ దరఖాస్తులు ఆగస్టు 14న ప్రారంభమయ్యాయి.  దరఖాస్తుకు చివరి తేదీ 13 సెప్టెంబర్ 2026 కాగా, అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15. దరఖాస్తులలో దిద్దుబాట్లు (కరెక్షన్ విండో) కోసం సెప్టెంబర్ 16 నుంచి సెప్టెంబర్ 25, 2026 వరకు అవకాశం కల్పించారు. 

సిబిటి ద్వారా ఎంపికఆర్‌ఆర్‌బీ జేఈ భర్తీలో అభ్యర్థుల ఎంపిక 2 దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా చేస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. CBT 1, CBT 2 పరీక్షల తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఈ పరీక్షలు డిసెంబర్ 2026లో జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పరీక్ష తేదీకి దాదాపు 10 రోజుల ముందు ఎగ్జామ్ సిటీ వివరాలు, 4 రోజుల ముందు అడ్మిట్ కార్డ్‌లు విడుదల చేస్తారు.