RPF Notification: దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్ల పరిధిలో భారీగా ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శ్రీకారంచుట్టింది. దీనిద్వారా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్‌పీఎఫ్‌)/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌) విభాగాల్లో మొత్తం 4,660 ఖాళీలను భర్తీచేయనున్నారు. వీటిలో సబ్-‌ఇన్‌స్పెక్టర్(RPF SI) - 452 పోస్టులు, కానిస్టేబుల్ (RPF Constable) - 4208 పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన సంక్షిప్త ప్రకటనను రైల్వేశాఖ(RRB) విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్‌ 15 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు మే 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు (ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్-PMT, ఫిజికల్ స్డాండర్ట్ టెస్ట్-PET), వైద్య పరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాల ఎంపిక చేపడతారు. 


రీజియన్ల వారీ ఖాళీలు, విద్యార్హత, రాత పరీక్ష, సిలబస్‌ తదితర పూర్తి వివరాలు త్వరలో విడుదలకానున్నాయి. ఇక సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (మార్చి 2- 8) పత్రికలో చూడవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్ ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో ఖాళీలను భర్తీచేస్తారు.


వివరాలు..


* మొత్తం పోస్టుల సంఖ్య: 4,660.


➥ సబ్ ఇన్‌స్పెక్టర్: 452 పోస్టులు


అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 01.07.2024 నాటికి 20 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.


జీతం: నెలకు రూ.35,400 చెల్లిస్తారు. 


➥ కానిస్టేబుల్: 4,208 పోస్టులు


అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.


వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి.


జీతం: నెలకు రూ.21,700 చెల్లిస్తారు. 


దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 


ఎంపిక విధానం: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్‌ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 15.04.2024. 


➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.05.2024. 




ALSO READ:


SSC CPO Notification: 4187 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (CAPF- (బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ) విభాగాల్లో సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్చి 4న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 5న ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 28 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థులకు మే 9, 10, 13 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించనున్నారు. ఎంపికైనవారిని ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన(సీఏపీఎఫ్‌) బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల్లో భర్తీచేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లి్క్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...