రైల్వేల్లో గ్రూప్-డి పోస్టుల భర్తీకి నిర్వహించిన ఆన్‌లైన్ రాతపరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అక్టోబరు 14న విడుదల చేయనుంది. అక్టోబరు 14న మధ్యాహ్నం 1 గంట నుంచి ఆన్సర్ కీ అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాతపరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు.


ఆన్సర్ కీపై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే తెలపడానికి రైల్వేరిక్రూట్‌మెంట్ బోర్డు అవకాశం కల్పించింది. అక్టోబరు 14న కీ విడుదల చేయనున్నారు. అక్టోబరు 15 నుంచి 19 వరకు కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబరు 15న ఉదయం 10 గంటల నుంచి అక్టోమరు 19న రాత్రి 11.55 గంటల వరకు అభ్యంతరాలు తెలపవచ్చు. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి.


గ్రూప్-డి(ఆర్‌ఆర్‌సీ 01/2019) నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 10 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) పరీక్ష నిర్వహించింది.


ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో లెవల్-1 కింద 1,03,769 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో జనరల్-42,355; ఎస్సీ-15,559, ఎస్టీ-7,984, ఓబీసీ-27,378; ఈడబ్ల్యూఎస్-10,381 పోస్టులను కేటాయించారు. ఈ ఉద్యోగాల కోసం దాదాపు కోటిన్నర మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.



Website


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


 


:: Read Also ::


Railway Jobs: సదరన్‌ రైల్వేలో 3154 అప్రెంటిస్‌ ఖాళీలు, ఐటీఐ అర్హత!
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సదరన్ ‌రైల్వే వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. షార్ట్‌లిస్టింగ్‌, అకడమిక్‌ మెరిట్‌, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల  కోసం క్లిక్ చేయండి..



Railway Jobs: ఈస్టర్న్ రైల్వేలో 3115 అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!

కోల్‌కతాలోని తూర్పు రైల్వే , రైల్వే రిక్రూట్‌మెంట్‌సెల్ (ఆర్ఆర్‌సీ) తూర్సు రైల్వే పరిధిలోని వర్క్ షాప్‌లు, డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. పదోతరగతితోపాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి  అర్హులు. సెప్టెంబరు 30న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, మెడికల్ ఫిట్‌నెస్, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



IRCTC: ఐఆర్‌సీటీసీలో అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

ఇండియన్ రైల్వే కేటరింగ్ & టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC)లో అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతిలో 50 శాతం మార్కులతోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...