RRB ALP Application: రైల్వేశాఖ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలో అసిస్టెంట్ లోకో పైలట్ (Assistant Loco Pilot) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 5,696 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సికింద్రాబాద్ జోన్‌ పరిధిలో 758 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 199 పోస్టులు, సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 559 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జనవరి 20న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఫిభ్రవరి 19తో దరఖాస్తు గడువు ముగియనుంది. అర్దరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసినవారు ఈ పోస్టులకు అర్హులు. మూడేళ్ల డిప్లొమా (మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌) అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.  రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష(స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు.


వయోపరిమితి పెంపు..
దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌(ఏఎల్‌పీ) కొలువులకు ఆర్‌ఆర్‌బీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లో అభ్యర్థుల వయోపరిమితిని 18-30 సంవత్సరాలుగా పేర్కొన్నారు. అయితే వయోపరిమితిని మూడేళ్లు పెంచుతున్నట్లు రైల్వేశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజా నిర్ణయం ప్రకారం ఏఎల్‌పీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు జులై 1 నాటికి 18-33 సంవత్సరాలలోపు ఉండాలని తెలిపింది. అయితే ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. 


Notification


ALP Online Application


వివరాలు..


* అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులు


ఖాళీల సంఖ్య: 5,696.


రీజియన్లవారీగా ఖాళీలు..


➥ అహ్మదాబాద్ (WR): 238 పోస్టులు


➥ అజ్‌మేర్ (NWR): 228 పోస్టులు


➥ బెంగళూరు (SWR): 473 పోస్టులు


➥ భోపాల్ (WCR-WR): 284 పోస్టులు 


➥ భువనేశ్వర్ (ECoR): 280 పోస్టులు


➥ బిలాస్‌పూర్ (CR-SECR): 1316 పోస్టులు


➥ చండీఘర్ (NR): 66 పోస్టులు 


➥ చెన్నై (SR): 148 పోస్టులు


➥ గోరఖ్‌పూర్ (NER): 43 పోస్టులు


➥ గువాహటి (NFR): 62 పోస్టులు 


➥ జమ్ము - శ్రీనగర్ (NR): 39 పోస్టులు


➥ కోల్‌కతా(ER-SER): 345 పోస్టులు 


➥ మాల్దా (ER-SER): 117 పోస్టులు 


➥ ముంబయి (SCR-WR-CR): 547 పోస్టులు 


➥ ముజఫర్‌పూర్ (ECR): 38 పోస్టులు  


➥ పట్నా (ECR): 38 పోస్టులు 


➥ ప్రయాగ్‌రాజ్ (NCR-NR): 286 పోస్టులు 


➥ రాంచీ (SER): 153 పోస్టులు 


➥ సికింద్రాబాద్ (ECoR-SCR): 758 పోస్టులు 


➥ సిలిగురి (NFR): 67 పోస్టులు 


➥ తిరువనంతపురం (SR): 70 పోస్టులు 


అర్హత: అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసినవారూ దరఖాస్తుకు అర్హులు. 


వయోపరిమితి: 01.07.2024 నాటికి 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3-6-8 సంవత్సరాలు; రైల్వేలో గ్రూప్-సి, గ్రూప్-డి విభాగంలో పనిచేస్తున్నవారికి 40-43-45 సంవత్సరాలు; వితంతువులు, ఒంటరి మహిళలకు 35-38-40 సంవత్సరాలు; 25 సంవత్సరాలలోపు ఉండి అప్రెంటిస్ పూర్తిచేసినవారికి 35-38-40 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.


పే స్కేల్: నెలకు రూ.19,900- రూ.63,200 చెల్లిస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.01.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19.02.2024.


➥ దరఖాస్తుల సవరణ: 20.02.2024 - 29.02.2024.


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి. . .