RITES Vacancies: గుర్‌గ్రామ్‌లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకానామిక్ సర్వీస్(రైట్స్) ఒప్పంద ప్రాతిపదికన ఇండివిడ్యువల్‌ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 67 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులని అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌/బీఈ, డిప్లొమా ఉత్తీర్ణత కలిగినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 09 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. విద్యార్హతలు, డాక్యుమెంట్ స్క్రూటినీ/వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, పని అనుభవం, టెక్నికల్‌ స్కిల్స్‌, సబ్జెక్టు నాలెడ్జ్, కమ్యూనికేషన్ అండ్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 67 పోస్టులు


* ఇండివిడ్యువల్‌ కన్సల్టెంట్‌ పోస్టులు


పోస్టుల వారీగా ఖాళీలు..


⏩ రెసిడెంట్‌ ఇంజినీర్‌(సివిల్‌): 07 పోస్టులు
లొకేషన్/పోస్టింగ్: ఉత్తరప్రదేశ్.
అర్హత: సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బీటెక్‌/బీఈ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 
అనుభవం: వంతెనల నిర్మాణంలో అభ్యర్థికి కనీసం 10 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. 
జీతం: నెలకు రూ.1,80,000.


⏩ అసిస్టెంట్‌ ఇంజినీర్‌(సివిల్‌): 12 పోస్టులు
లొకేషన్/పోస్టింగ్: ఉత్తరప్రదేశ్.
అర్హత: సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బీటెక్‌/బీఈ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 
అనుభవం: వంతెనల నిర్మాణంలో అభ్యర్థికి కనీసం 08 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. 
జీతం: నెలకు రూ.1,00,000.


⏩ సైట్‌ ఇంజినీర్‌ (సివిల్‌): 24 పోస్టులు
లొకేషన్/పోస్టింగ్: ఉత్తరప్రదేశ్.
అర్హత: సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బీటెక్‌/బీఈ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 
అనుభవం: వంతెనల నిర్మాణంలో అభ్యర్థికి కనీసం 05 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. 
జీతం: నెలకు రూ.50,000.


⏩ ల్యాబ్‌ టెక్నీషియన్‌(సివిల్‌): 24 పోస్టులు
లొకేషన్/పోస్టింగ్: ఉత్తరప్రదేశ్.
అర్హత: సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. 
అనుభవం: వంతెనల నిర్మాణంలో అభ్యర్థికి కనీసం 02 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 62 సంవత్సరాలు మించకూడదు. 
జీతం: నెలకు రూ.40,000.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: విద్యార్హతలు, డాక్యుమెంట్ స్క్రూటినీ/వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, పని అనుభవం, టెక్నికల్‌ స్కిల్స్‌, సబ్జెక్టు నాలెడ్జ్, కమ్యూనికేషన్ అండ్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఆధారంగా.


దరఖాస్తు ఫారమ్‌కు జతచేయాల్సిన డాక్యుమెంట్‌లు..


➥ 1 పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్


➥ పుట్టిన తేదీ ధృవీకరణ కోసం హై స్కూల్ సర్టిఫికేట్


➥ మొత్తం అన్ని సెమిస్టర్‌లు/సంవత్సరాలకు సంబంధించిన(టెన్త్, ఇంటర్, డిప్లొమా/ గ్రాడ్యుయేషన్/ పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్తించే విధంగా) అకడమిక్ & ప్రొఫెషనల్ అర్హతల సర్టిఫికెట్‌లు అండ్ అన్ని అర్హతల మార్కుల స్టేట్‌మెంట్‌లు కలిగిన సర్టిఫికేట్‌లు


➥ ఎక్ప్‌పీరీయన్స్ సర్టిఫికేట్‌లు


➥ ప్రూఫ్ అఫ్ ఐడెంటిటీ & అడ్రస్ (పాస్పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ మొదలైనవి)


➥ పాన్ కార్డు


➥ దరఖాస్తు ఫారమ్‌లో చూపిన విధంగా వివిధ కాలాల ఎక్ప్‌పీరీయన్స్ ప్రూఫ్ సర్టిఫికేట్‌లు(వర్తిస్తే)


➥ ఏదైనా ఇతర డాక్యుమెంట్‌లు అవరమైతే

ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: : 09.01.2025.


🔰 ఇంటర్వ్యూ తేదీ: 06.01.2025 నుంచి 10.01.2025 వరకు.


ఇంటర్వ్యూ వేదిక: 
* RITES Office, Lucknow
  13KM. Milestone, NH-24, SitapurRoad,Lucknow-226201, (Near SEWA Hospital).


* RITES Corporate Office, Gurugram
   Shikhar, Plot No.01, Sector-29, Gurugram-122001.


Notification


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...