Jagadhatri Serial Today Episode: వైజయంతి, నిషిక, యువరాజ్ కోపంగా ధాత్రి, కేదార్ లను తిడుతుంటారు. అసలు అమ్మ ఇంట్లో ఉండటమే వాళ్లకు ఇష్టం లేదేమోనని యువరాజ్ అంటాడు. తప్పు చేస్తే ఎవరినైనా వదిలిపెట్టను అది జగధాత్రి అయినా.. పిన్ని అయినా సరే వదిలిపెట్టేది లేదు అంటుంది కౌషికి. దీంతో వైజయంతి భయపడుతుంది. మీరేందుకు భయపడుతున్నారు పిన్ని మీరు తప్పు చేయరని నాకు తెలుసు అంటుంది కౌషికి. ఇంతలో కేదార్, ధాత్రి వస్తారు.
ధాత్రి: ఏమైంది నిషి అందరూ మమ్మల్నే కోపంగా చూస్తున్నారు. మేము లేనందుకు మీరైమైనా ఇబ్బంది పడ్డారా..?
సుధాకర్: మీరు లేనందుకు కాదమ్మ.. మీరు పెట్టిన అన్నం వల్ల
యువరాజ్: మీరు అమ్మకు పెట్టిన కారం కలిపిన అన్నం తినడం వల్ల.
కౌషికి: పిన్నికి అసలే ఆరోగ్యం బాగాలేదు. పిన్ని బాధకు మేము కూడా కారణం అయ్యాము. ఎందుకు ఇలా చేశావు.
ధాత్రి: అత్తయ్య గారు తినే అన్నంలో నేను ఉప్పు కారం కలపడం ఏంటి..?
నిషికి: నువ్వు కలపకపోతే మేము కలిపామా..?
ధాత్రి: నేను కలిపింది ఉల్లికారం, నెయ్యి. బాధపడకండి అత్తయ్యగారు యువరాజ్ టాబ్లెట్స్ తెచ్చారట కదా..?
కౌషికి: టాబ్లెట్స్ గురించి కాదు జగధాత్రి. నువ్వు పెట్టిన కారం అన్నం గురించి
నిషిక: మీరు ఇలా మాట్లాడాతరేంటి వదిన. గట్టిగా చెప్పండి.
కేదార్: ఏం మాట్లాడుతున్నావు నిషిక పిన్ని కోసం సేవ చేసిన ధాత్రినే అనుమానిస్తారా..?
ధాత్రి: సరేలే కేదార్ నిషిక నువ్వు చెప్పినట్టు ఆ అన్నం తింటాను
నిషిక: నువ్వు తినడం కాదే.. నేనే తినిపిస్తాను ఉండు ఇదిగో తిను
అని నిషిక తినిపిస్తే.. ధాత్రి తిని చాలా అమృతంలా ఉందని చెప్తుంది. ధాత్రి అబద్దం చెప్తుంది అని నిషిక అంటే కావాలంటే మీరు తినండి వదిన అని కౌషికికి తినిపిస్తుంది. కారం ఏం లేదు కదా..? బాబాయ్ మీరు తినండి అని చెప్పగానే సుధాకర్ తిని చాలా బాగుంది అంటాడు. దీంతో వైజయంతి షాక్ అవుతుంది. ఇది నాకు పెట్టినప్పుడు కారం ఉంది ఇప్పుడు ఏం మాయ జరిగింది అని మనసులో అనుకుంటుంది. ప్లేట్ మార్చిన విషయం ధాత్రి గుర్తు చేసుకుంటుంది. తర్వాత సురేష్‌ను తీసుకుని దివ్యాంక, కౌషికి వాళ్ల ఇంటికి వస్తుంది. వాళ్లిద్దరిని చూసిన కౌషికి కింద పడబోతుంటే కేదార్ వచ్చి పట్టుకుంటాడు.
దివ్యాంక: పడిపోవడం అలవాటు చేసుకో కౌషికి. ఇప్పటి నుంచి ప్రతిరోజు నా ముందు పడిపోతూనే ఉండాలి. ఓడిపోతూనే ఉండాలి. ఏడుస్తూనే ఉండాలి. (అని మనసులో అనుకుంటుంది.)
నిషిక: ఏంటి దివ్యాంక కాబోయే ఆయనను తీసుకుని వచ్చావు. పెళ్లికి పిలవడానికి వచ్చావా..?
ధాత్రి: పెళ్లా…
యువరాజ్: నువ్వంటే నిషిక కోసం వచ్చావు. కానీ అతనెందుకు వచ్చాడు. అతనికి ఈ ఇంట్లో స్థానం లేదు. అతనికి ఇంట్లోకి కూడా ప్రవేశం లేదు.
కేదార్: యువరాజ్ నువ్వు పరాయి వాడిలా మట్లాడుతున్న అతను ఈ ఇంటి అల్లుడు.
బూచి: అల్లుడా..? అయితే పట్టుకోవాల్సింది కౌషికి చేయి కదా కేదార్. నువ్వు అన్న దానికి ఇక్కడ జరగుతున్న దానికి సంబందమే లేనట్టుంది.
సురేష్: నేను ఏ హోదా కోసం రాలేదు. నాకు ఏ హోదా అవసరం లేదు.
ధాత్రి: అది ఇవ్వడానికి వాళ్లెవరు..? వద్దనడానికి మీరెవరు..? మీరు ఎప్పటికైనా ఈ ఇంటి అల్లుడే..
దివ్యాంక: కరెక్టే ధాత్రి. కానీ ఇవాళ్టీతో ఆ బంధం తెంచుకోవడానికే వచ్చాడు.
అని దివ్యాంక చెప్పగానే అందరూ షాక్ అవుతారు. వాళ్లకు క్లారిటీగా నువ్వే చెప్పు సురేష్ అంటూ దివ్యాంక సురేష్‌ను రెచ్చగొడుతుంది. దీంతో సురేష్ నాకు విడాకులు కావాలి అని చెప్తాడు. కౌషికి షాక్ అవుతుది. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!