గురుగావ్‌లోని రైట్స్ లిమిటెడ్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ(సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు గేట్ 2023 అర్హత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తు ప్రక్రియ జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 20
* గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ(సివిల్ ఇంజినీరింగ్) పోస్టులు.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ(సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత, గేట్ 2023 అర్హత సాధించాలి.
వయోపరిమితి: 01.06.2023 నాటికి 21-30 సంవ్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఈడబ్ల్యూఎస్/ఎస్సీ /ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 300.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.40000-రూ.1.4లక్షలు చెల్లి్స్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.06.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 30.06.2023.
Also Read:
సీమెన్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు- అర్హతలివే!
పూణేలోని సీమెన్స్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫ్రెషర్స్‌తోపాటు, అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు పూణేలోని కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.
నోటిఫికేషన్, ఉద్యోగ వివరాల కోసం క్లిక్ చేయండి..
న్యూఢిల్లీ పీఎంబీఐలో 37 అసిస్టెంట్ మేనేజర్& సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
న్యూఢిల్లీలోని ఫార్మాసూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా(పీఎంబీఐ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును అనుసరించి బీఫార్మసీ, బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, బీసీఏ, బీటెక్, బీకామ్, ఎంఫార్మసీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంకామ్, ఎంసీఏ, ఎంటెక్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఈమెయిల్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
పూణే ఐఐటీఎంలో 22 రిసెర్చ్ అసోసియేట్&రిసెర్చ్ ఫెలో పోస్టులు, వివరాలు ఇలా!
పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ(ఐఐటీఎం) రిసెర్చ్ అసోసియేట్&రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డాక్టరేట్ డిగ్రీ, సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్, గేట్/ జెస్ట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..