RITES Recruitment: రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(రైట్స్) అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 16 పోస్టులను భర్తీ చేయనున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్/కాస్ట్ అకౌంటెంట్‌తో పాటు బ్యాంకింగ్, జీఎస్‌టీ లేదా ఇన్‌కమ్- టాక్స్, అకౌంట్స్ ప్రిపరేషన్, ఆడిట్, ఏదైనా టెండరింగ్ ప్రక్రియలో పాల్గొనడం, బిల్లు పాసింగ్ ఫీల్డ్‌లలో2 సంవత్సరాలు పని అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
* అసిస్టెంట్ మేనేజర్(ఫైనాన్స్) పోస్టులు
ఖాళీల సంఖ్య: 16
పోస్టుల కేటాయింపు: యూఆర్ (జనరల్)-08, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ-04, ఎస్సీ-02, ఎస్టీ-01.
అర్హత: చార్టర్డ్ అకౌంటెంట్/ కాస్ట్ అకౌంటెంట్ కలిగి ఉండాలి.
అనుభవం: బ్యాంకింగ్, జీఎస్‌టీ లేదా ఇన్‌కమ్- టాక్స్, అకౌంట్స్ ప్రిపరేషన్, ఆడిట్, ఏదైనా టెండరింగ్ ప్రక్రియలో పాల్గొనడం, బిల్లు పాసింగ్ ఫీల్డ్‌లలో2 సంవత్సరాలు పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించరాదు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం: రాత పరీక్ష, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఎంపిక విధానంలో రాతపరీక్షకు 60 శాతం, ఇంటర్వ్యూకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూలో టెక్నికల్ & ప్రొఫెషనల్ ప్రొఫీషియన్సీకి 30 శాతం, పర్సనాలిటీ కమ్యూనికేషన్ & కాంపిటెన్సీకి 10 శాతం వెయిటేజీ ఉంటుంది.
పరీక్ష విధానం: మొత్తం 125 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 125 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. అకౌంటెన్సీ, ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, కంప్యూటర్ బేసిక్స్, రీజనింగ్, ట్యాక్సేషన్, బ్యాంకింగ్ & ట్రెజరీ, ప్రొక్యూర్‌మెంట్ & పేమెంట్, ట్రేడ్స్ పేయబుల్/ రిసీవబుల్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం లేదు. పరీక్ష సమయం 2.30 గంటలు. అయితే దివ్యాంగులకు అదనంగా 50 నిమిషాల సమయం కేటాయించారు.
కనీస అర్హత మార్కులు: రాతపరీక్షలో కనీస అర్హత మార్కులను యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 శాతంగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 45 శాతంగా నిర్ణయించారు. ఇక ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులను మార్కులను యూఆర్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60 శాతంగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 50 శాతంగా నిర్ణయించారు.
జీతం: నెలకు రూ. 40,000 - 1,40,000.
పరీక్ష కేంద్రం: ఢిల్లీ-ఎన్‌సీఆర్.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 29.01.2024.
➥ అడ్మిట్ కార్డుల విడుదల: 29.01.2024.
➥ రాత పరీక్ష తేదీ: 04.02.2024.
➥ దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూ తేది: ఫిబ్రవరి-మార్చి 2024.
ALSO READ:
CRPF: సీఆర్‌పీఎఫ్‌లో 169 కానిస్టేబుల్ పోస్టులు, వీరిక ప్రత్యేకం
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్-సి విభాగంలో కానిస్టేబుల్-జనరల్ డ్యూటీ (Constable-General Duty) నాన్-గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 169 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు, సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఫిభ్రవరి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..